Dalit Girl Expulsion From School : బడి నుంచి దళిత బాలిక బహిష్కరణ.. స్కూల్ డైరెక్టర్ వదినకు ఆమె తల్లిదండ్రులు ఓటేయలేదని..

మధ్యప్రదేశ్‌లోని శాజాపూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. బడి నుంచి ఓ దళిత బాలిక బహిష్కరణకు గురైంది. సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసిన తన వదినకు బాలిక తల్లిదండ్రులు, అక్కడ నివసించే వారు ఓటు వేయలేదనే కోపంతో బాలికను స్కూల్ డైరెక్టర్ పాఠశాల నుంచి బహిష్కరించారు.

Dalit Girl Expulsion From School : మధ్యప్రదేశ్‌లోని శాజాపూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. బడి నుంచి ఓ దళిత బాలిక బహిష్కరణకు గురైంది. సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసిన తన వదినకు బాలిక తల్లిదండ్రులు, అక్కడ నివసించే వారు ఓటు వేయలేదనే కోపంతో బాలికను స్కూల్ డైరెక్టర్ పాఠశాల నుంచి బహిష్కరించారు. ‘టీసీ కూడా తీసుకుపోండి’ అంటూ బాధిత బాలిక తల్లిదండ్రులకు హుకుం జారీ చేశారు.

శాజాపూర్‌ జిల్లా దుపారా గ్రామ పంచాయతీకి ఈ ఏడాది జూలైలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో స్కూల్‌ డైరెక్టర్‌ రవి పాటీదార్‌ వదిన సప్నా పాటీదార్‌ సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అదే గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని ఆకాంక్ష ఒకటో తరగతి చదువుతోంది. ఎన్నికల్లో సప్నా గెలిచినప్పటికీ ఆకాంక్ష తండ్రి రాజేశ్‌ చవ్రే, వారు నివసించే ప్రాంతం వారు ఓటేయలేదని రవి కక్ష పెంచుకున్నారు.

Caste Boycott : కామారెడ్డి జిల్లాలో కుటుంబం కుల బహిష్కరణ-3నెలలుగా ఇబ్బందులు

బాలికను పాఠశాలకు రానివ్వకుండా ఆపేశారు. బాధిత కుటుంబం దీనిపై అడగ్గా.. ‘మాకు మీరు ఓటేయలేదు.. మీ పాపకు మా స్కూల్లో చదువు చెప్పం, టీసీ కూడా తీసుకుపోండి’ అని తెలిపారు. ఈ ఘటనపై బాధిత తండ్రి కొన్ని రోజులుగా జిల్లా విద్యాశాఖాధికారితో పాటు సీఎం హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు