Caste Boycott : కామారెడ్డి జిల్లాలో కుటుంబం కుల బహిష్కరణ-3నెలలుగా ఇబ్బందులు

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక కుటుంబాన్ని కులపెద్దలు బహిష్కరించటంతో మూడునెలలుగా ఆ కుటుంబం పలు ఇబ్బందులు ఎదుర్కోంటోంది. 

Caste Boycott : కామారెడ్డి జిల్లాలో కుటుంబం కుల బహిష్కరణ-3నెలలుగా ఇబ్బందులు

Kamareddy Cast Boycatt

Caste Boycott :  కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక కుటుంబాన్ని కులపెద్దలు బహిష్కరించటంతో మూడునెలలుగా ఆ కుటుంబం పలు ఇబ్బందులు ఎదుర్కోంటోంది.  జిల్లాలోని సదాశివనగర్, తుక్కోజివాడి గ్రామానికి చెందిన చాకలి రవి  పంటపొలం వద్ద కరెంట్ విషయంలో వేరే వారితో గొడవ పడ్డాడు.

ఈవిషయం కుల పెద్దల ముందు అక్టోబర్ నెలలో పంచాయతీకి వచ్చింది. ఆ క్రమంలో కుల పెద్దలు చెప్పినట్లు   రవి నడుచుకోలేదు. దీంతో వారు రవి కుటుంబాన్ని బహిష్కరించారు. మంచి, చెడులకు ఎవ్వరూ వారి ఇంటికి వెళ్లవద్దని… వారి కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడినా రూ.50వేల జరిమానా విధిస్తామని హుకుం  జారీ చేశారు.
Also Read : Amit Shah : ఈనెల 21న అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం
దీంతో అందరూ రవి కుటుంబాన్ని బహిష్కరించారు.  పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై ఎస్సై శేఖర్ ను వివరణ కోరగా…. కోర్టు ద్వారా నోటీసు రావటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.