డాకు హసీనా ప్రేమ బాగోతం...
Daku Haseena has been married thrice: పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపిన డాకు హసీనా కేసులో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. లూథియానా నగరంలో రూ.8.4కోట్ల రూపాయలను దోపిడీ చేసి పారిపోయిన డాకు హసీనా అలియాస్ మన్‌దీప్ కౌర్ చేసిన ప్రతిజ్ఞ ఆమెను పోలీసులకు పట్టించింది. మన్‌దీప్ కౌర్ అలియాస్ డాకు హసీనా(Daku Haseena) లూథియానా దోపిడీని విజయవంతంగా అమలు చేసిన తర్వాత పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్ బద్రీనాథ్‌లోని హేమ్‌కుండ్ సాహిబ్‌లో ప్రార్థనలు చేస్తానని ప్రతిజ్ఞ (pledge) చేసింది.(Punjab robber couple) కానీ ఆమె చేసిన ప్రతిజ్ఞతోనే చివరికి జైలులో పడుతుందని ఆమెకు తెలియదు.
మూడు సార్లు వివాహాలు
డాకు హసీనా పారిపోయిన 10 రోజుల్లోనే ఘరానా దొంగను పంజాబ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ఈమె స్వగ్రామం లూథియానాలోని డెహ్లాన్ గ్రామమని పోలీసుల దర్యాప్తులో తేలింది. డాకు హసీనాను పంజాబ్ పోలీసులు ఉత్తరాఖండ్‌లోని చమోలీలో అరెస్టు చేశారు. మన్‌దీప్ కౌర్ కు ముగ్గురు సోదరులు ఉన్నారు. తాను ధనవంతురాలు కావాలనే మన్‌దీప్ కౌర్ భారీ చోరీకి పథకం పన్నిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.ఈమె మూడుసార్లు వివాహం చేసుకుంది.(Daku Haseena has been married thrice)
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కథ
మన్ దీప్ కౌర్ నాలుగు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన జస్విందర్ సింగ్ జస్సాను ప్రేమించి పెళ్లాడింది. మన్‌దీప్ కౌర్, జస్విందర్ సింగ్ జస్సా ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులు అయ్యారు. ఇంతకు ముందు వారు ఒకరి ఫోటోలు, వీడియోలను మరొకరు ఇష్టపడేవారు. ఆ తర్వాత ఇద్దరూ చాటింగ్ మొదలుపెట్టారు. మన్‌దీప్ కౌర్, జస్సాల మధ్య రెండున్నర నెలల పాటు కొనసాగిన ప్రేమబంధం తర్వాత 2023 ఫిబ్రవరి 16 వతేదీన జస్వీందర్‌ను వివాహం చేసుకున్నారు.
చోరీకి మన్ దీప్ కౌర్ పథకం
పెళ్లికి ముందు, జస్వీందర్ జస్సా మాక్‌టెయిల్ కాక్‌టెయిల్ విక్రేతలతో కలిసి పనిచేసేవాడు.మన్‌దీప్ కౌర్‌తో వివాహం తర్వాత, జస్వీందర్ సింగ్ మాక్‌టైల్ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడని వెల్లడైంది. దీని తర్వాత భార్యాభర్తలిద్దరూ రాత్రికి రాత్రే ధనవంతులు కావాలని చోరీకి ప్లాన్ వేశారు.పోలీసులు మన్‌దీప్ ద్విచక్ర వాహనం నుంచి రూ.12 లక్షలు, ఆమె భర్త బర్నాలా ఇంటి నుంచి రూ.9 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.మిగిలిన చోరీ సొత్తును ఎక్కడ దాచిందనే విషయంపై పోలీసులు ఆమెను ఇంటరాగేట్ చేస్తున్నారు.
రాణి తేనెటీగను పట్టుకుందాం అంటూ స్పెషల్ పోలీసు ఆపరేషన్
దొంగల జంట పుణ్యక్షేత్రాల సందర్శన, ఆపై నేపాల్ దేశానికి పారిపోవాలనే వ్యూహం గురించి పోలీసులకు సమాచారం అందింది. అంతే పంజాబ్ పోలీసుల డాకు హసీనాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ కు ‘రాణి తేనెటీగను పట్టుకుందాం’ అని పేరు పెట్టారు.
ఫలించిన పోలీసు వ్యూహం
లూథియానాలో దోపిడీని విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రతిగా నివాళులర్పించేందుకు డాకు హసీనా దంపతులు సిక్కు మందిరాన్ని సందర్శించారు.ఉత్తరాఖండ్‌లోని సిక్కు మందిరాన్ని సందర్శిస్తున్న భక్తుల్లో డాకు హసీనా జంటను గుర్తించడం కష్టం. దీంతో యాత్రికుల కోసం ఉచితంగా డ్రింక్ సర్వీస్ ఏర్పాటు చేయాలని పోలీసులు ప్లాన్ చేశారు.ఇదే సమయంలో నిందితులైన డాకు హసీనా దంపతులు డ్రింక్ స్టాల్ వద్దకు వచ్చారు. వారు పట్టుబడకుండా ఉండటానికి వారి ముఖాలను కప్పుకున్నారు. కానీ పోలీసులు ఏర్పాటు చేసిన డ్రింక్ తాగడానికి వారి ముఖాలను తెరవవలసి వచ్చింది. దీంతో పోలీసులు వారిని గుర్తించారు.
పోలీసులు వలపన్ని పట్టుకున్నారు…
డాకు జంటను పోలీసులు వలపన్ని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.మన్‌దీప్ కౌర్, ఆమె భర్త జస్విందర్ సింగ్‌ను అరెస్టు చేశారు. దంపతులే కాకుండా పంజాబ్‌లోని గిద్దర్‌బాహాకు చెందిన మరో నిందితుడు గౌరవ్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ధనవంతురాలు కావాలనే దోపిడీ
లూథియానా నగరంలో 8.49 కోట్ల రూపాయల దోపిడీ వెనుక నిందితుల్లో డాకు హసీనా అని పిలిచే మన్‌దీప్ కౌర్ నిందితురాలు. ఆమె జూన్ 10వతేదీన న్యూ రాజ్‌గురు నగర్ ప్రాంతంలోని కార్యాలయంలో సీఎంఎస్ సెక్యూరిటీస్ కంపెనీకి చెందిన ఐదుగురు ఉద్యోగులను బందీగా చేసి, అత్యంత చాకచక్యంగా దోపిడీ చేసింది. ఇప్పటి వరకు జరిపిన పోలీసుల విచారణలో డాకు హసీనా ధనవంతురాలు కావాలనుకున్నట్లు తేలింది. ఆమె అప్పులు చేసి, అంతకుముందు ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా,లాయర్‌కి అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆమెకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జస్వీందర్ సింగ్‌తో వివాహం జరిగింది.