×
Ad

142 Years Prison Sentenced : ప‌దేళ్ల బాలిక‌పై అత్యాచారం చేసిన వ్యక్తికి 142 ఏళ్లు జైలు శిక్ష

ప‌దేళ్ల బాలిక‌పై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన వ్య‌క్తికి కేర‌ళ‌లోని పధ‌నంథిట్ట పోక్సో కోర్టు 142 ఏళ్ల జైలు శిక్ష‌తో పాటు రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. నిందితుడు జ‌రిమానా చెల్లించ‌నిప‌క్షంలో మ‌రో మూడేండ్లు జైలులో ఉండాల‌ని కోర్టు ఆదేశించింది.

Kerala POCSO Court

142 Years Prison Sentenced : ప‌దేళ్ల బాలిక‌పై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన వ్య‌క్తికి కేర‌ళ‌లోని పధ‌నంథిట్ట పోక్సో కోర్టు 142 ఏళ్ల జైలు శిక్ష‌తో పాటు రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. నిందితుడు జ‌రిమానా చెల్లించ‌నిప‌క్షంలో మ‌రో మూడేండ్లు జైలులో ఉండాల‌ని కోర్టు ఆదేశించింది. జిల్లాలో పోక్సో కేసులో విధించిన గ‌రిష్ట శిక్ష ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

నిందితుడు పీఆర్ అలియాస్ బాబు(41) ప‌దేళ్ల బాలిక‌పై 2019 నుంచి 2021 వరకు అత్యాచారం చేసినందుకు అతనిపై తిరువ‌ల్ల పోలీసులు 2021 మార్చి 20న కేసు న‌మోదు చేశారు. బాలిక‌కు బంధువైన బాబు ఆమె త‌ల్లితండ్రుల‌తో క‌లిసి అదే ఇంటిలో నివ‌సించేవాడు.

Tamil Nadu Crime : 10ఏళ్ల బాలికపై అత్యాచారం..103 ఏళ్ల రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ కు 15 ఏళ్ల జైలు శిక్ష

ఆ స‌మ‌యంలో బాలిక‌ను బాబు అత్యంత క్రూరంగా లైంగిక వేధింపులకు గురిచేశాడ‌ని తిరువ‌ల పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ కేసు వివ‌రాల‌ను, ద‌ర్యాప్తు క్ర‌మాన్ని వివ‌రిస్తూ కోర్టులో చార్జిషీట్ దాఖ‌లు చేశారు. వాదోప‌వాద‌న‌లు విన్న అనంత‌రం బాబుకు పోక్సో కోర్టు 142 ఏళ్ల జైలు శిక్ష‌తో పాటు రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించిన‌ట్టు జిల్లా పోలీసులు తెలిపారు.