Tamil Nadu Crime : 10ఏళ్ల బాలికపై అత్యాచారం..103 ఏళ్ల రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ కు 15 ఏళ్ల జైలు శిక్ష

10ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో మహిళా న్యాయమూర్తి ..103 ఏళ్ల రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ కు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తు తీర్పు వెలువరించారు.

Tamil Nadu Crime : 10ఏళ్ల బాలికపై అత్యాచారం..103 ఏళ్ల రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ కు 15 ఏళ్ల జైలు శిక్ష

103 Year Old Sentenced To 15 Years In Prison In Girl Molestation Case

103 Year Old Sentenced To 15 Years In Prison In Girl rape Case : పాలబుగ్గల పసిబిడ్డపై పాపానికి ఒడిగట్టాడు ముత్తాత వయస్సున్న కామాంధుడు. పసిపాపకు మంచి చెడ్డలు చెప్పాల్సిన తాత వయస్సున్న మృగం అత్యాచారానికి పాల్పడ్డాడు.చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన 103 ఏళ్ల వృద్ధుడికి 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు 45 వేల రూపాయల జరిమానా విధిస్తూ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కోర్టు శిక్ష విధించింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి సుభద్ర ఈ సంచలన తీర్పుని వెలువరించారు. 100 సంవత్సరాలు దాటి జీవించటమంటే ఈరోజుల్లో ఘనత అనే చెప్పాలి. అటువంటిది 100 ఏళ్లు దాటిన వృద్ధుడి చచ్చి ఒక్కటే..బతికున్నా ఒక్కటే అన్నంత ఘాతుకానికి ఒడిగట్టాడు. చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ నరరూప రాక్షసుడికి న్యాయమూర్తి సుభద్ర ఇటువంటివారు సమాజంలో ఉండటానికి అర్హులు కాదు అని వ్యాఖ్యానిస్తూ 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 15 ఏళ్లు జైలు శిక్ష అంటే..ఇక జైలులో మరణించటమే.

Also read : Stabbed Teacher: స్కూల్లో 30ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి 101సార్లు పొడిచిన పూర్వ విద్యార్థి

తిరువళ్లూరు జిల్లా, పూందమల్లికి చెందిన పరశురామన్‌ అనే 103 ఏళ్ల వ్యక్తి స్కూల్లో టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. 100 ఏళ్లు కూడా దాటాయి. ఈ క్రమంలో పరశురామన్ ఇంట్లోకి ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తి భార్య పిల్లలతో కలిసి అద్దెకు ఉండేవారు. 2018లో వారి 10 ఏళ్ల పాప ఇంట్లో ఆడుకుంటుండగా ఆ పసిబిడ్డపై 103 ఏళ్ల ముసిలివాడి కామపు కన్ను పడింది. తన వయస్సేంటి..పసిబిడ్డ అనికూడా ఆ మృగానికి అనిపించలేదు. ఆడుకునే ఆ పాపకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధతో ఆ పసిపాప ఏడుస్తుంటే కూడా వాడికి కనికరం కలగలేదు. సరికదా..ఈ విషయం మీ అమ్మానాన్నలకు గానీ ఇంకెవరికన్నా చెబితే కత్తితో పొడిచి చంపేస్తాను అంటూ బెదిరించాడు.దీంతో ఆ పాప భయపడిపోయింది.

ఆ కామాంధుడి చేష్టలకు విలవిల్లాడిపోయిందా బాలిక. భరించలేకపోయింది. ఆ బాధతో పలు ఆరోగ్య సమస్యలు రావడంతో చక్కగా ఆడుకునే బిడ్డ అలా అయిపోవటంతో బాధతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికకు పరీక్షలు చేసిన డాక్టర్లు పాపపై అత్యాచారం జరిగింది అని చెప్పారు. దీంతో బిడ్డను సముదాయించి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది బాలిక. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు ఆవడి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరశురామన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read : Liquid Ganja : లిక్విడ్ గంజాయి సరఫరా చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ అరెస్ట్

కేసు విచారణ తిరువళ్లూరు మహిళా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో 2018 నుంచి విచారణ కొనసాగింది. విచారణ పూర్తయిన క్రమంలో న్యాయమూర్తి సుభద్ర బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పరశురామన్‌కు 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు 45 వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు అదనంగా శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ తీర్పును అమలు చేయాలని పోలీసులకు ఆదేశించారు.