Stabbed Teacher: స్కూల్లో 30ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి 101సార్లు పొడిచిన పూర్వ విద్యార్థి

ప్రైమరీ స్కూల్ లో చదువుకునే రోజుల్లో జరిగిన అవమానానికి 30ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడో వ్యక్తి. నిందితుడు 37 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి కాగా, గురువారం ఈ వాదనపై తీర్పు..

Stabbed Teacher: స్కూల్లో 30ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి 101సార్లు పొడిచిన పూర్వ విద్యార్థి

Crime Scene

Updated On : March 18, 2022 / 4:05 PM IST

Stabbed Teacher: ప్రైమరీ స్కూల్ లో చదువుకునే రోజుల్లో జరిగిన అవమానానికి 30ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడో వ్యక్తి. నిందితుడు 37 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి కాగా, గురువారం ఈ వాదనపై తీర్పు వెలువడింది.

59 సంవత్సరాల వయస్సున్న వెర్లిండన్.. Antwerp అనే ప్రాంతంలో 2020లో హత్యకు గురయ్యారు. హత్య కేసు చేధించడానికి బెల్జియన్ పోలీసులు తలమునకలయ్యేంత కృషి చేశారు. హంతకుడి కోసం వందల్లో డీఎన్ఏ శాంపుల్స్ పరీక్షించారు. ఆమె భర్త పబ్లిక్ అప్పీల్ చేసి హంతకుడెవరో చెప్పాలంటూ మొరపెట్టుకున్నాడు కూడా.

101 సార్లు కత్తి పోటుకు గురైన ఆమెతో పాటు ఉన్న పర్సు నిండా డబ్బు ఉంది. అయినప్పటికీ డైనింగ్ టేబుల్ వద్ద ఉన్న ఆమెను పొడిచి డబ్బులు ముట్టుకోకుండా వెళ్లిపోయాడు నిందితుడు.

Read Also : కొడుతున్నారంటూ టీచర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండో తరగతి చిన్నోడు

20 నవంబర్ 2020న జరిగిన మర్డర్ పై 16నెలల తర్వాత నిందితుడి గురించి పోలీసులకు సమాచారం అందింది. అలర్ట్ అయిన పోలీసులు ఆదివారం అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

మర్డర్ సీన్ లో జరిగిన డీఎన్ఏ శాంపుల్స్ ను నిందితుడితో మ్యాచ్ చేశారు. మాజీ విద్యార్థి ఈ ఘటనలకు పాల్పడినట్లు తెలిసింది. అలా నేరస్థుడు పూర్తిగా ఘటన వివరాలు చెప్పాడు. తాను చంపడానికి వెనుక కారణాలను వివరించాడు. తన టీచర్ కారణంగానే ప్రైమరీ స్కూల్ సమయంలో చాలా ఇబ్బందులకు గురయ్యానని వివరించాడు.

ఇంత దారుణంగా 101 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన ఉవెంటస్ అనే వ్యక్తి ఇల్లు లేని వారికి ఆసరా కల్పించి సాయం చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు