Liquid Ganja : లిక్విడ్ గంజాయి సరఫరా చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిక్విడ్ గంజాయిని రవాణా చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Liquid Ganja : లిక్విడ్ గంజాయి సరఫరా చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ అరెస్ట్

Liquid Cannabis

Updated On : March 19, 2022 / 11:05 AM IST

Liquid Ganja :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిక్విడ్ గంజాయిని రవాణా చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెంలోని ఆరో బెటాలియన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సపావత్ రాజ్ కుమార్, బుద్ది దుర్గా ప్రసాద్ అనే వ్యక్తితో కలిసి శుక్రవారం రెండు సీసాల్లో ఉన్న లిక్విడ్ గంజాయి ని ద్విచక్ర వాహానం పై తీసుకు వెళుతున్నాడు.

వైరా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు అనుమానాస్పదంగా కనిపించారు.  దీంతో  వీరిని తనిఖీ చేయగా వీరి వద్ద రెండు సీసాల్లో ఉన్న లిక్విడ్ గంజాయి బయటపడింది. లిక్విడ్ గంజాయి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. వీరిద్దరినీ మధిర కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై చెప్పారు.

Also Read : karnataka Accident : కర్ణాటకలో ఘోర ప్రమాదం..ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా..10మంది మృతి