karnataka Accident : కర్ణాటకలో ఘోర ప్రమాదం..ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా..10మంది మృతి

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు.

karnataka Accident :  కర్ణాటకలో ఘోర ప్రమాదం..ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా..10మంది మృతి

Bus Accident

Updated On : March 19, 2022 / 10:59 AM IST

karnataka  Accident : కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. తుముకూరు జిల్లా పాలంకల్లి దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో 10మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 25మందికి తీవ్రంగా గాయాలు కాగా వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

కర్ణాటక సమీపంలోని ఎం.ఎస్ కోటనుంచి పావగాడకు విద్యార్ధులతో వస్తున్న SVT ప్రైవేట్ ట్రావెల్ బస్సు పాలంకల్లి వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడినవారిని బెంగళూరు ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాదానికి గురైన ఈ బస్సులో 45మందికి పైగా ప్రయాణిస్తుండగా..బస్ టాప్ పైన కూడా 10నుంచి 15మంది ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురి అయిన ఈ బస్సులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.