Allahabad High Court
Allahabad High Court : భార్యపై శృంగారం విషయంలో అలహాబాద్ హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. భార్యకు 18 ఏళ్లకు పైబడి వయసు ఉంటే భారతీయ శిక్ష్మాస్మృతి ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అసహజ శృంగారం చేశారనే ఆరోపణలపై భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఐపీసీ సెక్షన్ 377 కింద వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించలేమని జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది.
ALSO READ : Bahujan Samaj Party : బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన…తన రాజకీయ వారసుడు ఎవరంటే…
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. భార్యకు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నప్పుడు వైవాహిక అత్యాచారానికి ఎలాంటి క్రిమినల్ పెనాల్టీ ఉండదని హైకోర్టు పేర్కొంది. ఫిర్యాదుదారు అయిన భార్య వివాహాన్ని దుర్వినియోగం చేస్తూ తన భర్త శారీరక వేధించాడని, బలవంతానికి గురిచేశాడని ఆరోపించింది.సెక్షన్ 377 కింద అభియోగాల నుంచి భర్తను నిర్దోషిగా విడుదల చేసింది.