Narayana College Incident Accountant Died : నారాయణ కాలేజ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనలో విషాదం..అకౌంటెంట్ అశోక్ రెడ్డి మృతి

హైదరాబాద్ రామంతాపూర్‌ నారాయణ కాలేజ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనలో ఒకరు మృతి చెందారు. విద్యార్థిని రక్షించేందుకు వెళ్లిన అకౌంటెంట్ అశోక్ రెడ్డి మరణించారు. కొద్ది రోజుల క్రితం నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సదరు విద్యార్థిని కాపాడేందుకు అకౌంటెంట్ అశోక్ రెడ్డి వెళ్లాడు.

Narayana College Incident Accountant Died : హైదరాబాద్ రామంతాపూర్‌ నారాయణ కాలేజ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనలో ఒకరు మృతి చెందారు. విద్యార్థిని రక్షించేందుకు వెళ్లిన అకౌంటెంట్ అశోక్ రెడ్డి మరణించారు. కొద్ది రోజుల క్రితం నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సదరు విద్యార్థిని కాపాడేందుకు అకౌంటెంట్ అశోక్ రెడ్డి వెళ్లాడు. అయితే విద్యార్థిని రక్షించే క్రమంలో అశోక్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అశోక్ రెడ్డి మృతి చెందారు.

గత నెలలో నారాయణ కాలేజీలో ఫీజు విషయంలో విద్యార్థికి, యాజమాన్యానికి మధ్య ఘర్షణ జరిగింది. ఫీజు చెల్లించకుంటే.. టీసీ ఇచ్చేది లేదని కాలేజీ యాజమాన్యం తెగేసి చెప్పడంతో టీసీ ఎలా ఇవ్వరో చూస్తామని విద్యార్ధి తరపున వచ్చిన స్టూడెంట్ లీడర్ వార్నింగ్ ఇచ్చాడు. ఆగస్టు 19న ఏకంగా పెట్రోల్ పోసుకుని బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే, అనుకోకుండా జరిగిన ప్రమాదంలో స్టూడెంట్ లీడర్, కాలేజ్ సిబ్బంది మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు.

Hyderabad: ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి.. ఇద్దరికీ గాయాలు

రామంతాపూర్‌కు చెందిన సాయినాథ్… నారాయణ కాలేజ్‌లో ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేశాడు. అతడు కాలేజ్‌కు 16వేల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంది. దీంతో కాలేజ్ యాజమాన్యం…అతడికి టీసీ ఇవ్వలేదు. సాయినాథ్, తన తల్లిదండ్రులతో కలిసి టీసీ ఇవ్వాలని యాజమాన్యాన్ని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశాడు. 16వేలు కడితే తప్ప టీసీ ఇచ్చేది లేదని ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డి, ఏవో అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సాయినాథ్ స్టూడెంట్ లీడర్ సందీప్‌ను కలిసి తనకు టీసీ ఇప్పించాలని కోరాడు. విద్యార్థి సంఘం నేతలు సందీప్, వెంకటచారి కొంత మంది యూనియన్ సభ్యులతో కలిసి సాయినాథ్‌ కాలేజ్‌కు వెళ్లాడు.

రూమ్‌లో ప్రిన్సిపల్, ఏవోతో కొద్దిసేపు చర్చలు జరిపారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. యాజమాన్యం ఎంతకు దిగి రాకపోవడంతో.. వారిని సందీప్ బెదిరించాలనుకున్నాడు. తనపై పెట్రోల్ పోసుకున్నాడు. అయితే పక్కనే దేవుడి ఫోటోల ముందు దీపం వెలిగించి ఉంది. సందీప్ తనపై పెట్రోల్ పోసుకోగానే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అతడి పక్కనే ఉన్న వెంకటచారికి మంటలు వ్యాపించాయి. కుర్చీలో కూర్చుని ఉన్న ఏవో అశోక్‌రెడ్డికి కూడా గాయాలయ్యాయి.

Hyderabad : నారాయణ కాలేజీలో ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి ఘటనలో బిగ్ ట్విస్ట్..!!

కాలిన గాయాలతో గత 15 రోజులుగా డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అశోక్‌ రెడ్డి ఇవాళ చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 15 రోజుల చికిత్స తర్వాత అశోక్‌ రెడ్డి చనిపోయారు. పోస్టుమార్టం కోసం అశోక్‌ రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అటు ఇదే ఘటనలో గాయపడ్డ విద్యార్థి సంఘ నాయకులు సందీప్, వెంకటాచారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు