Hyderabad: ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి.. ఇద్దరికీ గాయాలు

కాలేజీ యాజమాన్యం ఫీజు కోసం వేధిస్తుండటంతో విద్యార్థి తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. తర్వాత ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నాడు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్, విద్యార్థి.. ఇద్దరూ గాయపడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Hyderabad: ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి.. ఇద్దరికీ గాయాలు

Hyderabad: ఒంటికి నిప్పంటించుకున్న ఒక విద్యార్థి, వెంటనే ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. విద్యార్థి స్థానిక నారాయణ కాలేజీలో చదువుకుంటున్నాడు.

Munawar Faruqui: మునావర్ షోకు అనుమతి నిరాకరణ.. ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్

అయితే విద్యార్థి కొంతకాలం నుంచి ఫీజు చెల్లించకపోవడంతో ప్రిన్సిపాల్‌తోపాటు కాలేజీ యాజమాన్యం నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో విసుగు చెందిన విద్యార్థి శుక్రవారం పెట్రోల్ బాటిల్ వెంట తెచ్చుకున్నాడు. తర్వాత ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి, తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ప్రిన్సిపాల్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్‌కు కూడా నిప్పంటుకుంది. దీంతో ప్రిన్సిపాల్‌తోపాటు విద్యార్థికి కూడా తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరినీ కాలేజి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

Dahi Handi: ఉట్టికొడితే రూ.55 లక్షలు.. స్పెయిన్ యాత్ర.. భారీ బహుమతులు ప్రకటించిన పార్టీలు

ఈ ఘటన చూసిన విద్యార్థులంతా చెల్లాచెదురుగా పరుగులు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.