Munawar Faruqui: మునావర్ షోకు అనుమతి నిరాకరణ.. ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖి షో అనుమతి నిలిపివేశారు పోలీసులు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శనివారం మునావర్ ఫారూఖి షో జరగాల్సి ఉంది. ప్రస్తుతం షో అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసులు ప్రకటించారు.

Munawar Faruqui: మునావర్ షోకు అనుమతి నిరాకరణ.. ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్

Munawar Faruqui: స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖి హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన కామెడీ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. షో అనుమతిని తాత్కాలికంగా రద్దు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శనివారం మునావర్ ఫారూఖి షో జరగాల్సి ఉంది.

Pregnant Died: డిగ్రీ యువతిని గర్భవతిని చేసిన యువకుడు.. అబార్షన్ చేయిస్తుండగా యువతి మృతి

‘‘15 రోజుల క్రితం కామెడీ షోకు నిర్వాహకులు అనుమతి తీసుకున్నారు. అయితే, అనుమతి పత్రంలో మునావర్ ఫారూఖి పేరు పేర్కొనలేదు. తర్వాత మునావర్ గురించి తెలిసింది. దీనిపై విచారణ జరుపుతున్నాం. అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చాకే కామెడీ షోపై తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ షోను అడ్డుకుంటామని ప్రకటించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు. మునావర్ హిందూ దేవతల్ని అవమానించారని ఆరోపణలున్నాయి. దీంతో బీజేపీతోపాటు హిందూ సంస్థలు మునావర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటకలో మునావర్ షోలపై ఇప్పటికే నిషేధం విధించారు. షో కోసం మునావర్ హైదరాబాద్ వస్తే అంతుచూస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.

Dahi Handi: ఉట్టికొడితే రూ.55 లక్షలు.. స్పెయిన్ యాత్ర.. భారీ బహుమతులు ప్రకటించిన పార్టీలు

నిజానికి ఈ ఏడాది జనవరిలోనే హైదరాబాద్‌లో మునావర్ షో జరగాల్సి ఉంది. అప్పట్లో కరోనా వల్ల షో వాయిదా పడింది. ఆ సందర్భంగా కూడా రాజాసింగ్, హిందూ సంస్థలు షోను అడ్డుకుంటామని ప్రకటించాయి. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో షో చేసేందుకు మునావర్ ప్రయత్నిస్తున్నాడు. ఈ సారి కూడా రాజా సింగ్, హిందూ సంస్థల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఆయన షో చేస్తే తాము చేయాల్సింది చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులు స్పందించారు. రాజాసింగ్‌ను హౌజ్ అరెస్ట్ చేయడంతోపాటు, షో అనుమతి పూర్తిగా రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.