94శాతం అత్యాచార కేసుల్లో బాధితులపై అఘాయిత్యం చేసింది తెలిసినవారే : ప్రభుత్వ డేటా

94% Cases Of Rape : 2019లో దేశంలో అత్యాచార ఘటనలకు పాల్పడింది బాధితులకు తెలిసినవారే ఎక్కువ మంది ఉన్నారని ప్రభుత్వం డేటా వెల్లడించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. లైంగిక-సంబంధిత నేరాల్లో తెలియని వ్యక్తులతో పోలిస్తే.. చిన్నారులు, మహిళలు తమ సొంత బంధువులు, తెలిసిన వ్యక్తులే అఘాయిత్యానికి పాల్పడినట్టు డేటా వెల్లడించింది.
94.2 శాతం బాధితుల బంధువులే నిందితులు :
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2019 తాజా నివేదికలో 94.2 శాతం అత్యాచార కేసులలో బాధితులకు తెలిసినవారే నిందితులుగా ఉన్నారని పేర్కొంది. NCRB (National Crime Records Bureau) గణాంకాల ప్రకారం.. 2019లో, పిల్లలపై 1,48,185 నేరాలు నమోదయ్యాయి. ఇందులో 31.2 శాతం చిన్నారులపై నేరాలు పోక్సో చట్టం కింద నమోదయ్యాయని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. NCRB గణాంకాల ప్రకారం, 2019 లో, పిల్లలపై 1,48,185 నేరాలు నమోదయ్యాయి.
అత్యాచారం ఆరోపణలతో కూడిన పోక్సో చట్టం కింద 26,192 కేసుల్లో 24,672 మంది నిందితులుగా ఉన్నారని డేటా వెల్లడించింది. 2,153 అత్యాచార కేసులలో నిందితుడు కుటుంబ సభ్యులలో ఒకరిగా ఉన్నారని అధికారి తెలిపారు. ఏజ్ లిమిట్ విశ్లేషణలో 16-18 ఏళ్ళ వయస్సు వారు ఇలాంటి నేరాలకు ఎక్కువగా గురవుతున్నారని గుర్తించారు. అత్యాచారం ఆరోపణలతో పోక్సో చట్టం కింద నమోదైన 26,192 కేసుల్లో 25,934 మంది బాలికలు, 258 మంది బాలురు ఉన్నారని NCRB డేటా తెలిపింది.
2019లో చిన్నారులపై 4.5 శాతం పెరిగిన కేసులు :
2019లో 16,399 కేసులు నమోదు కాగా.. వాటిలో 16,139 మంది బాలికలు, 260 మంది బాలురు ఉన్నారని NCRB నివేదిక పేర్కొంది. పిల్లలపై నేరాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సేకరించిన డేటా 2019లో 4.5 శాతం పెరిగిందని సూచిస్తోంది. పోక్సో చట్టం కింద కేసుల నమోదు 18.9 శాతంగా పెరిగింది.
ఈ చట్టం ప్రకారం కేసులు నమోదు కావడానికి కొన్ని కారణాలను చేర్చడం ద్వారా పోక్సో చట్టంలోని సవరణలను అమలు చేయాలని సూచిస్తుందన హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హింసాత్మక ఘటన కేసులు 201.9 శాతం పెరిగాయి. సైబర్ క్రైమ్స్ 40.2 శాతం పెరిగాయి. కిడ్నాప్, అపహరణ కింద నమోదైన కేసులు 10.2 శాతం మేర పెరిగాయి, అపహరణకు గురైన పిల్లల్లో 32.7 శాతం కిడ్నాప్ చేసినట్లు డేటా పేర్కొంది.