కర్నాటకలో దారుణం : మహిళా కండక్టర్‌పై యాసిడ్ దాడి

  • Published By: madhu ,Published On : December 20, 2019 / 06:11 AM IST
కర్నాటకలో దారుణం : మహిళా కండక్టర్‌పై యాసిడ్ దాడి

Updated On : December 20, 2019 / 6:11 AM IST

దేశంలో మహిళపై దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోలేదని..ఇతరత్రా కారణాలతో దాడులకు తెగబడుతున్నారు. కొందరు దారుణంగా చంపేస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా కండక్టర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేయడం కలకలం సృష్టించింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రస్తుతం ICUలో ట్రీట్ మెంట్ పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

పూర్తి వివరాల్లోకి వెళితే : – బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్‌లో ఇందిరా బైరి కండక్టర్‌గా పనిచేస్తున్నారు. BMTCలో ఈమె భర్త డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. బాగలకుంటేలో నివాసంలో ఉంటున్నారు. 2019, డిసెంబర్ 19వ తేదీ గురువారం విధులకు వెళ్లేందుకు ఇందిరా రెడీ అయ్యారు. ఇంటి వద్ద నిలబడి ఉండగా.. ఆ సమయంలో స్కూటర్‌‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్ బాటిల్ విసిరి పరారయ్యారు.

వేడికి తట్టుకోలేక ఆమె కేకలు వేసింది. స్థానికులు ఆస్పత్రికి సమాచారం అందించారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి..చికిత్స అందిస్తున్నారు. వీపు, మెడ, ముఖంపై గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాప్రదేశానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆమె దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని, ఆరు నెలల క్రితం దాడి జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఇందిరా కోలుకున్న అనంతరం స్టేట్ మెంట్ కోసం తాము ప్రయత్నిస్తున్నామని పోలీసులు  తెలిపారు. ఘటనపై ఆమె కుటుంబసభ్యులు, స్థానికులు విచారించడం జరిగిందన్నారు. వ్యక్తిగతంగా దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.  

Read More : సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు : కొత్త కొత్తగా రేషన్ కార్డులు