వివాహేతర సంబంధం: ప్రియుడిని చంపిన టీవీ నటి

  • Published By: vamsi ,Published On : December 31, 2019 / 04:04 AM IST
వివాహేతర సంబంధం: ప్రియుడిని చంపిన టీవీ నటి

Updated On : December 31, 2019 / 4:04 AM IST

వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేయడంతో టీవీ నటి దేవి తన మాజీ ప్రియుడిని హత్య చేసింది. ఈ కేసులో ఆమెతోపాటు మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. తమిళ టీవీ సీరియళ్లలో నటించే దేవి తన భర్త శంకర్‌తో కలిసి చాలా కాలంగా వడపళనిలో నివసిస్తుంది. ఈ క్రమంలో మధురైకి చెందిన రవి(38) అనే వ్యక్తి 10ఏళ్ల క్రితం సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చెన్నైకి వచ్చాడు. సాలిగ్రామంలో నివసిస్తున్న రవికి దేవితో పరిచయం అయ్యింది.

అయితే వీరిద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఇటీవల ప్రియుడిని వదిలించుకోవాలని చెప్పాపెట్టకుండా కొలత్తూర్‌ సెమాత్తమన్‌ కోవిల్‌ వీధికి ఇల్లు మార్చుకుంది. నటిగా అవకాశాలు తగ్గడంతో టైలరింగ్‌ వృత్తిని చేపట్టింది. కాగా, ఆమె కోసం పలు చోట్ల వెతికిన రవికి దేవి చెల్లెలు లక్ష్మి ఇంటి చిరునామా దొరికింది. దీంతో మద్యం సేవించి లక్ష్మి ఇంటికి వెళ్లిన రవి ఘర్షణకు దిగాడు.

దీనిపై సమాచారం అందుకున్న దేవి తన భర్త శంకర్‌తో కలిసి లక్ష్మి ఇంటికి చేరుకుని రవిని వెళ్లిపోవాలని కోరింది. దీనికి అంగీకరించని రవి వాగ్వాదానికి దిగగా.. కోపం పట్టలేని దేవి ఇనుప రాడ్డుతో, ఆమె భర్త శంకర్‌ కట్టెతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన రవి మద్యం మత్తులో ఉండగా.. అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో కొలట్టూర్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రవి దేవి, శంకర్, లక్ష్మిని అరెస్ట్ చేశారు. రవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కీల్‌పాక్కమ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు.