తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపీ రాజేంద్రన్ (62) మృతి చెందారు. శనివారం(ఫిబ్రవరి-23-2019) తెల్లవారుజామున 4.35గంటలకు
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపీ రాజేంద్రన్ (62) మృతి చెందారు. శనివారం(ఫిబ్రవరి-23-2019) తెల్లవారుజామున 4.35గంటలకు ఆయన ప్రయాణిస్తున్న వాహనం విల్లుపురం జిల్లా దిండివనమ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలతో తీవ్రంగా గాయపడ్డ ఎంపీ రాజేంద్రన్.. స్పాట్ లోనే చనిపోయారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. తైలపురంలో పీఎంకే పార్టీ అధినేత రామదాస్ ఇచ్చిన విందుకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో రాజేంద్రన్ కారు ప్రమాదానికి గురైంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రాజేంద్రన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో విల్లుపురం నుంచి ఎన్నికయ్యారు. ఎంపీ మృతి పట్ల అన్నాడీఎంకే పార్టీ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. రాజేంద్రన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.