Anju-Nasrullah Wedding : అంజూ-నస్రుల్లా వివాహం వెనుక పాక్ ఐఎస్ఐ కుట్ర…మధ్యప్రదేశ్ పోలీసుల విచారణ

భారత వివాహిత మహిళ అంజూ తన పాకిస్థానీ ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాతో వివాహం చేసుకున్న ఉదంతం సంచలనం రేపడంతో పాటు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భర్త, ఇద్దరు పిల్లల తల్లి అయిన అంజూ పాక్ దేశానికి చెందిన నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకున్న ఘటనలో పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర దాగి ఉందా అనే కోణంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....

Anju-Nasrullah Wedding : భారత వివాహిత మహిళ అంజూ తన పాకిస్థానీ ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాతో వివాహం చేసుకున్న ఉదంతం సంచలనం రేపడంతో పాటు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. (Anju-Nasrullah Wedding) భర్త, ఇద్దరు పిల్లల తల్లి అయిన అంజూ పాక్ దేశానికి చెందిన నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకున్న ఘటనలో పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర దాగి ఉందా అనే కోణంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Probe Conspiracy Angle)

Indian woman : భారతీయ మహిళ ఫేస్‌బుక్ స్నేహితుడిని కలవడానికి పాక్ వెళ్లింది…

తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలిసేందుకు పాక్ వెళ్లిన అంజూ అనూహ్యంగా ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఫాతిమాగా మార్చుకొని అతన్ని వివాహం చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. (Rajasthan Woman Brainwashed by Pakistan ISI) ముందుగా కేవలం తన స్నేహితుడిని కలిసేందుకే పాక్ వచ్చానని ప్రకటించిన అంజూ అనంతరం అనూహ్యంగా అతన్ని వివాహం చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంజూ, నస్రుల్లా ప్రేమ, పెళ్లి వ్యవహారంలో పాక్ ఐఎస్ఐ కుట్ర దాగి ఉందని మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు.

Womens : ఆర్మీలో చేరే మహిళలకు కేంద్రం శుభవార్త

జులై నెల 25వతేదీన పాకిస్థాన్ స్నేహితుడు నస్రుల్లాను వివాహం చేసుకున్న తర్వాత అంజూ తన పేరును ఫాతిమాగా మార్చుకున్నారు. పెళ్లి అనంతరం అంజూ అలియాస్ ఫాతిమా ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని ఎగువ దిర్ జిల్లాకు చెందిన నస్రుల్లాతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇస్లాం మతాన్ని స్వీకరించిన అంజూకు కొంత వ్యవసాయ భూమి, ఇతర బహుమతులు వచ్చాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని రియల్ ఎస్టేట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహ్సిన్ ఖాన్ అబ్బాసీ అంజూ,నస్రుల్లాలను వారి నివాసంలో కలిసి, వారికి భూమి, నగదును బహుమతిగా అందించారు.

Rajasthan : ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. 8వ తరగతి విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం పోసిన తోటి విద్యార్థులు

ఇద్దరు పిల్లలను, భర్తను వదిలి అంజూ హఠాత్తుగా పాక్ పారిపోవడంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దిగ్భ్రాంతికరమైన ఎపిసోడ్‌పై మధ్యప్రదేశ్ సర్కారు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. అంజూ తండ్రి టేకాన్‌పూర్ పట్టణంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన యూనిట్‌కు తన గ్రామం సమీపంలో ఉండటంతో అంజూ పాక్ పారిపోయిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Sake Bharathi : కష్టానికి దక్కిన ఫలితం.. కూలి చేసుకుంటూ PHD సాధించిన సాకే భారతికి 2 ఎకరాల భూమి ఇచ్చిన ప్రభుత్వం

పాక్ పారిపోయిన తన కుమార్తె అంజూకు మతిస్థిమితం సరిగా లేదని, ఆమె పాక్ వెళ్లిపోయినందున తమకు ఆమె మరణించినవారితో సమానమని సాక్షాత్తూ అంజూ తండ్రి గయా ప్రసాద్ థామస్ చెప్పారు. పాక్ వివాహిత సీమా హైదర్ భారతదేశానికి వచ్చి హిందూ యువకుడు సచిన్ మీనాను వివాహం చేసుకున్న ఘటన జరిగిన వెంటనే అంజూ పాక్ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంజూ వ్యవహారంలో పాక్ ఐఎస్ఐ కుట్ర ఉందని అంటున్నారు. మొత్తం మీద అంజూ అలియాస్ ఫాతిమా ప్రేమ పెళ్లి బాగోతం నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు