Sake Bharathi : కష్టానికి దక్కిన ఫలితం.. కూలి చేసుకుంటూ PHD సాధించిన సాకే భారతికి 2 ఎకరాల భూమి ఇచ్చిన ప్రభుత్వం

సాకే భారతికి నిత్యం ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని కలెక్టర్‌ గౌతమి హామీ ఇచ్చారు. Sake Bharathi

Sake Bharathi : కష్టానికి దక్కిన ఫలితం.. కూలి చేసుకుంటూ PHD సాధించిన సాకే భారతికి 2 ఎకరాల భూమి ఇచ్చిన ప్రభుత్వం

Sake Bharathi(Photo : Google)

PHD Sake Bharathi : ఆమె కష్టానికి ఫలితం దక్కింది. ఆమె పోరాటం వృథా కాలేదు. పేదరికాన్ని జయించి ఎంతో కష్టపడి కూలి పనులు చేసుకుంటూ చదువుకున్నందుకు అందుకు తగ్గ ఫలితం వచ్చింది. ఆమె కృష్టి, పట్టుదల వృథా కాలేదు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో PHD సాధించిన సాకే భారతి టాలెంట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఆమెకు సాయం చేసి అండగా నిలిచింది. సాకే భారతికి 2 ఎకరాల వ్యవసాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. గవర్నమెంట్ తరపున రెండు ఎకరాల భూమి పట్టాను సాకే భారతికి అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి అందించారు.

కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో పొలం పట్టా అందజేసిన కలెక్టర్ గౌతమి.. భారతి సాధించిన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించిన భారతి.. ఎందరికో స్పూర్తిగా నిలిచారని కితాబిచ్చారు. సాకే భారతికి నిత్యం ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని కలెక్టర్‌ గౌతమి హామీ ఇచ్చారు.

”ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తరపున భారతికి శింగనమల మండలం సోదనపల్లి గ్రామ పొలం సర్వే నెంబరు 9-12లో వ్యవసాయ యోగ్యమైన రెండు ఎకరాల భూమి భారతికి అందించాం. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని నిర్మించి ఇస్తాం. ఎస్‌కేయూ పరిధిలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలో జేఎల్‌ పోస్టు (కెమిస్ట్రీ) ఖాళీగా ఉంది. ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్‌ చేస్తాం. జిల్లా యంత్రాంగం నుంచి ఆమెకు అన్ని విధాలుగా అవసరమైన ప్రోత్సాహం అందిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి” అని కలెక్టర్ గౌతమి ఆకాంక్షించారు.

Also Read..Skin Allergies : మామిడి పండు చర్మానికి అలెర్జీని కలిగిస్తుందా?

సాకే భారతిని యువత రోల్ మోడల్ గా తీసుకోవాలని కలెక్టర్ గౌతమి అన్నారు. చదువుకి పేదరికం అడ్డు కాదని చెప్పడానికి సాకే భారతి నిలువెత్తు నిదర్శనం అన్నారు. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని సాకే భారతి నిరూపించారని కలెక్టర్ గౌతమి ప్రశంసించారు.

అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామంలో కూలిపనులు చేసుకుంటూనే కెమిస్ట్రీలో PHD చేసిన సాకే భారతి విజయగాథ నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది. పేదరికాన్ని జయించి మరీ ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన డాక్టర్‌ భారతి సక్సెస్‌ స్టోరీ ఎంతో మందిని కదిలించింది. అనంతపురము జిల్లా శింగమనల నాగుల గుడ్డం గూడేనికి చెందిన భారతిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చేసింది. పదో తరగతి దాకా శింగనమల ప్రభుత్వ పాఠశాలలో చదివింది. ఇంటర్‌ పామిడి జూనియర్‌ కాలేజీలో పూర్తి చేసింది. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ నుంచి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ సాధించింది.

Also Read..After Meal : భోజనం తరువాత చేయకూడని పనులివే