After Meal : భోజనం తరువాత చేయకూడని పనులివే

ఎప్పుడు తిన్నా, తిన్న వెంటనే బ్రష్ చేస్తుంటారు.ఏదైనా తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం మంచి అలవాటే కానీ, తిన్న వెంటనే దంతాలను బ్రష్ చేయకూడదు. ముఖ్యంగా ఆమ్ల గుణాలు కలిగిన ఆహారపానీయాలు తీసుకున్నప్పుడు అస్సలు బ్రష్ చేయకూడదు.

After Meal : భోజనం తరువాత చేయకూడని పనులివే

after meals

After Meal : స్నానం చేసిన తరువాతే తినాలి. భోజనం తరువాత స్నానం చేస్తే తిన్నది ఒంటపట్టదు.. అంటుంటారు మన పెద్దవాళ్లు. ఇది నిజం కూడా. ఇదొక్కటే కాదు.. భోజనం చేసిన తరువాత చేయకూడని విషయాలెన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని…

READ ALSO : Leafy Vegetables : వర్షాకాలం ఆకు కూరలు తినడానికి సరైన సమయం కాదట

భోజనం చేసిన తరువాత చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి ఆరోగ్యంపై నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. భోజనం చేసిన వెంటనే కొంతమంది సిగరెట్ వెలిగిస్తారు, మరికొంత మంది నేరుగా వెళ్లి మంచంపై పడుకొని రిలాక్స్ అవుతారు. కానీ దీనివలన కడుపులో అసౌకర్యం లేదా మగతగా అనిపించడం ఇతరత్రా సమస్యలు గుర్తించలేనివి ఉండవచ్చు. ఇందుకు కారణం మీరు తిన్న ఆహారం కాదు, ఆహారం తీసుకున్న తరువాత అనుసరించే అలవాట్లు.

నిద్రపోవడం

భోజనం చేసిన తర్వాత జీర్ణ ప్రక్రియ మొదలవుతుంది. ఈ టైంలో కాస్త మగతగా అనిపించడం సహజం. అయితే తిన్న తర్వాత కొద్దిసేపు నిద్రపోవడం రిఫ్రెష్‌గా ఉన్నప్పటికీ, భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలు తలెత్తవచ్చు. యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య పెరుగుతుంది. తిన్న తర్వాత నిద్రించాలనుకుంటే లేదా అలా పడుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుంటే తిన్న వెంటనే పాడుకోవద్దు. కాసేపు అటూ ఇటూ నడిస్తే జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇలా కొద్ది సేపు అయిన తర్వాత నిద్ర పోతే కొంతవరకు అసిడిటీ సమస్య రాకుండా ఉంటుంది.

READ ALSO :  Loneliness : ఒంటరితనం నుంచి ఇలా బయటపడండి

బ్రష్ చేయడం

సాధారణంగా రాత్రి పడుకోబోయే ముందు మరొకసారి బ్రష్ చేసుకోమని చెబుతారు డాక్టర్లు. అయితే కొందరు ఎప్పుడు తిన్నా, తిన్న వెంటనే బ్రష్ చేస్తుంటారు.ఏదైనా తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం మంచి అలవాటే కానీ, తిన్న వెంటనే దంతాలను బ్రష్ చేయకూడదు. ముఖ్యంగా ఆమ్ల గుణాలు కలిగిన ఆహారపానీయాలు తీసుకున్నప్పుడు అస్సలు బ్రష్ చేయకూడదు. ఎందుకంటే యాసిడ్ వల్ల దంతాల పై ఉండే ఎనామిల్ కాస్త బలహీనపడుతుంది. ఈ సమయంలో బ్రష్ చేస్తే దంతాలపై ఉండే ఎనామిల్ తొలగిపోతుంది. ఫలితంగా అనేక రకాల దంత సమస్యలు వస్తాయి. కాబట్టి భోజనం తర్వాత మీరు పళ్ళు తోముకోవాలనుకుంటే, కనీసం ఒక 30 నిమిషాలు ఆగి, ఆ తర్వాత బ్రష్ చేసుకుంటే మంచిది.

ద్రవాలు ఎక్కువ తీసుకోవడం

భోజనం చేసిన వెంటనే అతిగా ద్రవాలు తీసుకోవడం ముఖ్యంగా శీతల పానీయాలు తాగడం చేయకూడదు. దీని వల్ల మీ కడుపులోని ఆమ్లాలు పలచబడి జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడుతుంది. భోజన సమయంలో మితంగా ద్రవపదార్థాలు తాగడం మంచిది.భోజనం తర్వాత పానీయాలు తాగాలనుకుంటే ఒక 30 నిమిషాలు సమయం ఇవ్వాలి.

READ ALSO :  Healthy Hair : జుట్టుకు ఏది బెస్ట్.. డెర్మటాలజిస్టులు ఇస్తున్న సూచనలు

పొగతాగడం

భోజనం తర్వాత సిగరెట్లు తాగేవారు చాలా మంది ఉంటారు. అసలు పొగతాగడమే చెడ్డ అలవాటంటే… ఇక తిన్న వెంటనే చేయడం మరింత చెడ్డ అలవాటు. దీని వల్ల జీర్ణ సంబంధింత వ్యాధులతో పాటు కొన్ని క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండటం ఉత్తమం.కానీ మీరు పొగ త్రాగకుండా ఉండలేకపోతే, తిన్న వెంటనే కాకుండా కనీసం 30 నిమిషాల నుండి గంట వరకు వేచి ఉండటానికి ప్రయత్నించండి.

కఠినమైన వ్యాయామం

భోజనం చేసిన వెంటనేఇంటెన్సిటీ ఎక్కువగా ఉండే వ్యాయామం చేయడం, తీవ్రమైన శారీరక శ్రమచేయకూడదు. దీనివల్ల జీర్ణవ్యవస్థ నుండి రక్త ప్రవాహం మళ్లిపోతుంది.ఇది జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. భోజనం తరువాత కాసేపు ఆగి నడకకు వెళ్ళవచ్చు. కానీ తీవ్రమైన శారీరక శ్రమ చేయాల్సి వస్తే కనీసం 1-2 గంటలు వేచి ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

READ ALSO : Heart Health : గుండె ఆరోగ్యం కోసం… కార్డియాక్ ఎక్సర్ సైజులు

పండ్లు తినడం

భోజనం చేసిన వెంటనే సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం తప్పు. భోజనం తర్వాత నారింజ, బత్తాయి, ద్రాక్షపండ్లు మొదలైన సిట్రస్ పండ్లను తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట పెరిగే ప్రమాదం ఉంది. ఈ పండ్లను తినాలనుకుంటే, భోజనానికి ముందు తినండి లేదా భోజనంతో పాటుగా తీసుకోవడం మంచిది.

READ ALSO : Dried Mango Slices : మామిడి ఒరుగుల తయారీ.. 3 నెలల్లో 12 కోట్ల టర్నోవర్

స్నానం చేయడం

భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. తిన్న వెంటనే స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది. దీనివల్ల జీర్ణక్రియలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా అజీర్తి, ఎసిడిటీ మొదలైన సమస్యలు వస్తాయి. ఇది మన శరీరం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తిన్న తర్వాత స్నానం చేయాలనుకుంటే కనీసం 30 నుంచి 45 నిమిషాలు ఆగి,ఆ తర్వాత స్నానానికి వెళ్ళండి.