Skin Allergies : మామిడి పండు చర్మానికి అలెర్జీని కలిగిస్తుందా?

మొటిమలు ఎక్కవగా వస్తున్నాయంటే చర్మంపై తేమతో పాటు మామిడి కూడా కాయరణం కావచ్చు. కొందరికి మామిడికాయలు తిన్న తర్వాత ముఖంపై చీముతో కూడిన కురుపులు వస్తాయి.

Skin Allergies : మామిడి పండు చర్మానికి అలెర్జీని కలిగిస్తుందా?

Mango allergy

Skin Allergies : మామిడిపండ్లు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. ఇంద్రియాలను ఉత్తేజపరిచే మామిడిని రసంగా, పుల్లని చట్నీరూపంలో, మామిడికాయలుగా వివిధ రూపాల్లో తీసుకుంటూ చాలా మంది దీని రుచిని ఆస్వాదిస్తుంటారు. అయితే మామిడి పండ్లు తినేవారిలో చాలా మంది చర్మసంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కొంతమందిలో లక్షణాలు తేలికపాటిగా ఉంటే మరికొందరిలో మాత్రం తీవ్రంగానే ఉంటాయి.

READ ALSO : Sleepless Nights : మనం చేసే రోజువారి తప్పులే నిద్రలేని రాత్రులు గడపటానికి కారణమా ?

మామిడి తొక్కలో అలర్జీని కలిగించే గుణాలను కలిగి ఉండే ఉరుషియోల్ నూనె చాలా మందికి అలెర్జీని కలిగిస్తుంది. ఇది ఒక టాక్సిన్. దీనివల్ల పొక్కులు, దద్దుర్లు వంటివి వస్తాయి. జంతువుల నుండి ఆకులను రక్షించడానికి ఉరుషియోల్ ఆయిల్ సహజంగా మామిడి చెట్టులో ఉత్పత్తి చేయబడుతుంది. దాని అవశేషాలు మామిడి తొక్కలపై ఉంటాయి. ఇవి అలెర్జీ ప్రతిచర్యను కలిగిస్తాయి.

READ ALSO : Abdominal pain: డెలివరీ తర్వాత పొత్తి కడుపులో తరచూ నొప్పి వస్తుందా? అయితే ఇలా చేయండి ..

మామిడి పండ్ల పై తొక్కతో తీసుకున్నప్పుడు జలదరింపుగా, కొంచెం దురదగా అనిపించడం చాలా సాధారణం. కొన్ని సెకన్లపాటు ఇది ఉంటుంది. అయితే, చాలా మంది వ్యక్తులలో ఇది మరింత తీవ్రమవుతుంది. శ్వాసనాళాలు బిగుతుగా మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే, మామిడి పండ్లను వాటి పై తొక్క తీసివేసిన తర్వాత తినడం వల్ల అటువంటి ప్రతిచర్య వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

READ ALSO : Mango Fruit Covers : నాణ్యమైన దిగుబడి కోసం మామిడికి కవర్ తో రక్షణ

మామిడిపండు చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ;

1. చర్మం దద్దుర్లు

మామిడిపండు తినేవారిలో దురద , చిన్న బొబ్బలు వంటి అలెర్జీ సమస్యలు ఏర్పడవచ్చు. తేలికపాటి లక్షణాలు ఉంటే దద్దుర్ల కు క్రీమ్ వంటి వాటిని అప్లై చేస్తే సరిపోతుంది. తీవ్రమైన సందర్భాల్లో, వైద్య నిపుణుడిని సంప్రదించాలి. లక్షణాలను నియంత్రించడానికి ఎపినెఫ్రైన్ ఆటో-ఇంజెక్టర్‌ను ఉపయోగించాలి.

READ ALSO : Vitamin D : విటమిన్ డి నోటి ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?

2. మామిడితో మొటిమలు

మొటిమలు ఎక్కవగా వస్తున్నాయంటే చర్మంపై తేమతో పాటు మామిడి కూడా కాయరణం కావచ్చు. కొందరికి మామిడికాయలు తిన్న తర్వాత ముఖంపై చీముతో కూడిన కురుపులు వస్తాయి. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే మామిడి పండ్లలోని ఫైటిక్ యాసిడ్ వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Meal Maker : చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచే మీల్ మేకర్ !

3. గడ్డలు

మామిడిపండ్లలోని అలర్జీని కలిగించే పదార్థం కొంతమందిలో గడ్డలు రావటానికి దారి తీస్తుంది. చర్మ సమస్యలను ఎదుర్కొంటుంటే మాత్రం మామిడి పండు తినే ముందు తొక్కను పూర్తిగా తొలగించటం మంచిది.

READ ALSO : Dental Health : దంత ఆరోగ్యం విషయంలో చాలా మందిలో నెలకొన్న అపోహలు Vs వాస్తవాలు !

4. బొబ్బలు

మామిడిపండ్లు బొబ్బలకు కూడా దారితీయవచ్చు. మామిడిపండు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తున్నప్పటికీ, అది కొన్నిసార్లు చర్మ సమస్యలకు గురి చేస్తుంది.

READ ALSO : పెదవుల ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించి చూడండి!

5. చర్మవ్యాధి నిపుణులను సంప్రదించటం ;

దురదృష్టవశాత్తూ, నోరూరించే పండ్లలో రారాజు అయిన మామిడి పండు చర్మానికి తగిలినప్పుడు చర్మం చికాకుగా , విపరీతంగా దురదగా ఉండే కాంటాక్ట్ డెర్మటైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందటం అవసరం.