Mango Fruit Covers : నాణ్యమైన దిగుబడి కోసం మామిడికి కవర్ తో రక్షణ

కాయలకు ప్రూట్ కవర్స్ కట్టి నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు ఏలూరు జిల్లా, నూజివీడు మండలం,సుంకొల్లు గ్రామానికి చెందిన రైతు ఆరెపల్లి రాంబాబు. ఈ కవర్లను  కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొటక్షన్ బేగ్స్ అంటారు. వాటర్ ప్రూఫ్ కలిగి వుండటంతోపాటు, అధిక ఎండల నుంచి రక్షణ కల్పిస్తుంది.

Mango Fruit Covers : నాణ్యమైన దిగుబడి కోసం మామిడికి కవర్ తో రక్షణ

Prevention of Pest Damage

Mango Fruit Covers : మామిడి తోటలు పూత దశ నుండి కాయను మార్కెట్ చేసేవరకు రైతుకు అడుగడుగునా  కష్టాలే. ప్రకృతి వైపరిత్యాలు, చీడపీడల బెడద నుండి పంటను కాపాడుకోవటం  ఒక ఎత్తైతే, వచ్చిన దిగుబడికి మార్కెట్లో మంచి ధర సాధించటం మరో ఎత్తు. ఎంత శ్రమకోర్చినా  పెట్టుబడికి తగ్గ ఆదాయం లేక రైతులు నిరుత్సాహానికి  గురవుతున్నారు. ఈ నేపధ్యంలో మామడి కాయలను సంరక్షించే ఫ్రూట్ కవర్స్ వాడుతూ.. నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు నూజివీడుకు చెందిన ఓ రైతు.

READ ALSO : Jeedi Mamidi Cultivation : తగ్గిన జీడిమామిడి దిగుబడి.. ఆందోళనలో రైతులు

వేసవి వచ్చిదంటే చాలు మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. మార్కెట్‌లో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు , వాతావరణ మార్పుల కారణంగా.. మామిడి పూత ఆలస్యంగా వచ్చింది . వచ్చిన పూత కాయగా మారి ఇగ పంట దిగుబడులు తీసుకోవచ్చనుకున్న తరుణంలో అధిక వర్షాలు, వడగండ్ల వానతో చాలా వరకు తోటలు దెబ్బతిన్నాయి.  దీంతో మామిడి పండ్ల దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది.

READ ALSO : Jeedi Mamidi Cultivation : జీడిమామిడి పూత, కాత ఆలస్యం.. కాయలు నిలిచేందుకు శాస్త్రవేత్తల సూచనలు

అయితే ముందు జాగ్రత్తగా కాయలకు ప్రూట్ కవర్స్ కట్టి నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు ఏలూరు జిల్లా, నూజివీడు మండలం,సుంకొల్లు గ్రామానికి చెందిన రైతు ఆరెపల్లి రాంబాబు. ఈ కవర్లను  కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొటక్షన్ బేగ్స్ అంటారు. వాటర్ ప్రూఫ్ కలిగి వుండటంతోపాటు, అధిక ఎండల నుంచి రక్షణ కల్పిస్తుంది. కాయ ఎదుగుదలకు అవసరమైన గాలి, వెలుతురుకు ఆటంకం వుండదు. పైగా అన్నిరకాల  చీడపీడలకు ఈ కవర్ రక్షణ గోడగా నిలుస్తుంది.