Indian woman : భారతీయ మహిళ ఫేస్‌బుక్ స్నేహితుడిని కలవడానికి పాక్ వెళ్లింది…

ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ ఉదంతం వార్తల్లో ఉండగానే...భారతదేశానికి చెందిన ఓ వివాహిత తన ఫేస్‌బుక్ స్నేహితుడిని కలిసేందుకు పాకిస్థాన్ దేశానికి వెళ్లిన ఘటన సంచలనం రేపింది....

Indian woman : భారతీయ మహిళ ఫేస్‌బుక్ స్నేహితుడిని కలవడానికి పాక్ వెళ్లింది…

Indian woman Anju

Updated On : July 24, 2023 / 6:46 AM IST

Indian woman : ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ ఉదంతం వార్తల్లో ఉండగానే…భారతదేశానికి చెందిన ఓ వివాహిత తన ఫేస్‌బుక్ స్నేహితుడిని కలిసేందుకు పాకిస్థాన్ దేశానికి వెళ్లిన ఘటన సంచలనం రేపింది. రాజస్థాన్‌లోని భివాడి జిల్లాకు చెందిన వివాహిత భారతీయ మహిళ అంజూ(34) అర్వింద్ దంపతులకు 15ఏళ్లు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. పాక్ యువకుడు ఫార్మా ఉద్యోగి అయిన నస్లుల్లాతో ఫేస్‌బుక్‌లో స్నేహం చేసింది.

Jharkhand : ప్రేమ జంటను కలిపిన ఇన్‌స్టాగ్రామ్.. ప్రియుడి కోసం పోలెండ్ నుంచి జార్ఖండ్ వచ్చిన మహిళ

నస్లుల్లాతో ప్రేమలో పడిన అంజు భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి ప్రేమికుడిని కలవడానికి పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌కు వెళ్లింది. (Indian woman crosses for love) జైపూర్‌కు వెళ్లే సాకుతో అంజు ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త అర్వింద్ చెప్పారు. (goes to Pak to meet Facebook friend) విదేశాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న అంజు 2020వ సంవత్సరంలో పాస్‌పోర్టు పొందిందని అరవింద్ తెలిపారు.

Seema Haider : పాక్ మహిళ సీమాహైదర్ కేసులో షాకింగ్ విషయాలు

అంజు తమతో వాట్సాప్ ద్వారా టచ్ లో ఉండేదని భర్త చెప్పారు. అంజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు భర్తకు ఫోన్ చేసి, తాను లాహోర్‌లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో తిరిగి స్వదేశానికి వస్తానని చెప్పింది. పాకిస్థాన్‌లో అంజు ప్రేమికుడి పుకారు గురించి అడిగినప్పుడు, తనకు దాని గురించి తెలుసునని, తన భార్య తన వద్దకు తిరిగి వస్తుందని అర్వింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అరవింద్ భివాడిలో పనిచేస్తున్నారు.

Plane Crash : పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో కూలిన విమానం…9మంది మృతి

పాక్ వెళ్లిన అంజు కూడా ఒక ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తుండేది. అరవింద్ తన భార్య పిల్లలతో, అంజు సోదరుడితో కలిసి భివాడిలోని అద్దె ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. క్రైస్తవ మతంలోకి మారిన అంజు అర్వింద్ ను వివాహం చేసుకుంది. అంజూను మొదట పాక్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఆమె ప్రయాణ పత్రాలను ధృవీకరించిన తర్వాత విడుదల చేశారు. అంజూ తిరిగి భారతదేశానికి వెళ్లేందుకు పాక్ పోలీసులు అనుమతించారు. ఒకవైపు పాక్ మహిళ సీమా హైదర్ తన ప్రేమికుడి కోసం భారతదేశానికి రాగా, భారత మహిళ తన ఫేస్‌బుక్‌ స్నేహితుడిని కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లడం సంచలనం రేపాయి.