Seema Haider : పాక్ మహిళ సీమాహైదర్ కేసులో షాకింగ్ విషయాలు

పబ్ జి ఆడుతూ భారతీయ యువకుడితో ప్రేమలో పడిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ గురించి యూపీ పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. సీమా హైదర్ నేపాల్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించడానికి తన పేరును ప్రీతిగా చెప్పిందని తాజాగా వెల్లడైంది....

Seema Haider : పాక్ మహిళ సీమాహైదర్ కేసులో షాకింగ్ విషయాలు

Pakistani woman Seema Haider

Pakistani woman Seema Haider : పబ్ జి ఆడుతూ భారతీయ యువకుడితో ప్రేమలో పడిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ గురించి యూపీ పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. సీమా హైదర్ నేపాల్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించడానికి తన పేరును ప్రీతిగా చెప్పిందని తాజాగా వెల్లడైంది. (Seema Haider became Preeti to enter India) దీంతో పాటు సీమా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడిందని యూపీ ఏటీఎస్ అధికారుల దర్యాప్తులో తేలింది.

Manipur Women Viral Video : నాటి షాకింగ్ ఘటన గురించి బాధిత మణిపూర్ మహిళ ఏం చెప్పారంటే…

శుక్రవారం సీమా హైదర్ పలు టీవీ విలేఖరులకు ఇంటర్వ్యూలిస్తుండగా యూపీ పోలీసులు అడ్డుకున్నారు. సీమా టూరిస్ట్ వీసాపై కరాచీ నుంచి దుబాయ్‌కి వెళ్లి, ఆపై నేపాల్‌లోని ఖాట్మండుకు చేరి బస్సులో భారతదేశానికి వచ్చింది. గ్రేటర్ నోయిడా నివాసి సచిన్‌తో కలిసి జీవించడానికి వీసా లేకుండా భారత్‌కు వచ్చిన సీమా హైదర్ పై పోలీసులు నిఘా వేశారు.

Heavy Rains : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు.. ఐఎండీ హెచ్చరికల జారీ,16మంది మృతి

సీమాను ఉత్తరప్రదేశ్ పోలీసు యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు చేసిన తర్వాత సీమా కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. సీమా ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతుందని, ఆమె ఆంగ్ల పాఠ్యాంశాలు చదివే విధానం పరిపూర్ణంగా ఉందని ఏటీఎస్ అధికారులు చెప్పారు. పబ్ జి గేమ్ ఆడేందుకు సీమా ఎక్కువగా ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల యువకులను సంప్రదించిందని తేలింది.

Pakistani national Seema Haider : సీమా హైదర్ కేసులో వెలుగుచూసిన సంచలన విషయాలు

అలా సచిన్ మీనాతో సీమాకు పరిచయం ఏర్పడి ఆపై ప్రేమగా మారి అది వారి పెళ్లికి దారితీసింది. తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించడానికి నేపాల్‌లోని పోఖారా నుంచి బస్సు ఎక్కినప్పుడు తన పేరు ప్రీతిగా చెప్పి నకిలీ ఆధార్ కార్డును కూడా చూపించిందని సమాచారం. (claimed she had Aadhaar) పాక్ సైన్యంలో పనిచేస్తున్న తన సోదరుడు, మామల గురించి సీమాను ఏటీఎస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీమా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్ఐ)కి ఏజెంట్ అనే అనుమానంతో ఏటీఎస్, ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.