Rajasthan : ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. 8వ తరగతి విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం పోసిన తోటి విద్యార్థులు

నీళ్లు దుర్వాసన రావడంతో షాక్ కి గురైంది. వెంటనే దీనిపై హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. Rajasthan

Rajasthan : ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. 8వ తరగతి విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం పోసిన తోటి విద్యార్థులు

Rajasthan Urine Mixed(Photo : Google)

Rajasthan Urine Mixed : చక్కగా స్కూల్ కి వెళ్లి బుద్ధిగా పాఠ్య పుస్తకాలు చదువుకోవాల్సిన విద్యార్థులు దారి తప్పుతున్నారు. ఊహకు అందని రీతిలో వయసుకి మించిన పనులు చేస్తున్నారు. నీచమైన పనులతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా రాజస్తాన్ లోని(Rajasthan) బిల్వారా జిల్లా లుహారియా(Luhariya) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. తోటి విద్యార్థిని వాటర్ బాటిల్ లో మూత్రం పోశారు. అంతేకాదు.. ఆ అమ్మాయి పుస్తకం మీద ఐ లవ్ యూ అని రాసి పైశాచిక ఆనందం పొందారు.

వాటర్ బాటిల్ లో(Water Bottle) మూత్రం(Urine) పోసిన విషయం తెలియని విద్యార్థిని ఆ నీటిని తాగింది. నీరు దుర్వాసన రావడంతో షాక్ కి గురైంది. విషయం అర్థమైంది. అందులో మూత్రం కలిసినట్లు తెలుసుకుని నివ్వెరపోయింది. వెంటనే దీనిపై హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. అంతే, వారిలో కోపం కట్టలు తెంచుకుంది. స్కూల్ దగ్గర ఆందోళనకు దిగారు. నిందితుల ఇళ్లపై రాళ్ల దాడి కూడా చేశారు.

Also Read..Cleric Kiss : ఛీ..ఛీ.. బరితెగించిన మతగురువు, అమ్మాయితో అసభ్యకర ప్రవర్తన, అక్కడ తాకుతూ ముద్దులు పెడుతూ.. వీడియో వైరల్

తన తరగతికే చెందిన ఇద్దరు విద్యార్థులపై బాలిక అనుమానం వ్యక్తం చేసింది. ఈ పని వారే చేసి ఉంటారని భావిస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇరువర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో స్కూల్ దగ్గరికి చేరుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. స్కూల్ దగ్గర భారీగా మోహరించారు. స్కూల్ దగ్గర గుమికూడిన ఇరువర్గాలను పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా లుహారియా గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ.. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

Also Read..Sri Sathyasai District : బాబోయ్.. ఒక్కసారిగా కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల భవనం, షాకింగ్ వీడియో

బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థుల్లో ఈ విపరీత ప్రవర్తన స్థానికులను షాక్ కి గురి చేసింది. పిల్లలు ఇంతకు దిగజారిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పు చేసిన విద్యార్థులపై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.