Gang War : ఎల్బీనగర్లో మరో గ్యాంగ్ వార్.. కుటుంబంపై 20మంది యువకుల దాడి
హైదరాబాద్ ఎల్బీనగర్ లో గ్యాంగ్ వార్ ఘటన మారువక ముందే మరో కలకలం రేగింది. ఎల్బీనగర్ లో 20 మంది యువకుల గ్యాంగ్ హల్చల్ చేసింది.

Gang War
Gang War : హైదరాబాద్ ఎల్బీనగర్ లో గ్యాంగ్ వార్ ఘటన మారువక ముందే మరో కలకలం రేగింది. ఎల్బీనగర్ లో 20 మంది యువకుల గ్యాంగ్ హల్చల్ చేసింది. ఓ ముగ్గురు యువకులపై దాడి చేయడానికి సుమారు 20 మంది యువకులు వచ్చారు. ప్రాణ రక్షణ కోసం ముగ్గురు యువకులు ఓ ఇంట్లోకి దూరారు. వారిని కొట్టొద్దంటూ అడ్డుకున్న కుటుంబంపైనా 20మంది యువకులు దాడి చేశారు.
Fresh Meat : తాజా మాంసాన్ని గుర్తించటం ఎలాగంటే?
గుంపుగా వచ్చిన గ్యాంగ్ ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడటంతో కుటుంబసభ్యులు బిత్తరపోయారు. భయంతో కేకులు వేశారు. ఈ కేకలు విన్న కాలనీ వారు అక్కడికి వచ్చేలోపు యువకులు ఆ ఇంటిపై రాళ్ల దాడి చేసి పారిపోయారు.
Ranapala : అనారోగ్య సమస్యలకు బ్రహ్మాస్త్రం… రణపాల
కాగా, దాడికి పాల్పడిన యువకుల్లో ఒక్కరిని పట్టుకున్న కాలనీ వాసులు అతడిని పోలీసులకు అప్పజెప్పారు. యువకులు హల్చల్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. అసలు ఆ యువకులు ఎవరు? ఎందుకు వచ్చారు? ఆ ముగ్గురిపై దాడి చేయడానికి కారణం ఏంటి? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.