Cop Murder Attempt On A Woamn
APSP constable who strangled the woman and attempted murder : తన భార్య ఆత్మహత్యకు కారణమైందనే కోపంతో నెల్లూరు జిల్లాలో ఓకానిస్టేబుల్ మహిళపై హత్యాయత్నం చేశాడు. కోవూరు మండలం, లక్ష్మినగరం గ్రామంలోని దళితవాడలో… ఎపీ ఎస్పీ9 బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ సురేష్ భార్య నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
అదే ప్రాంతంలో నివసించే కట్టుబడి షేకూన్ అనే మహిళే తన భార్య ఆత్మహత్యకు కారణమని భావించిన సురేష్ శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి చేరుకున్నాడు. తనతో తెచ్చుకున్న బ్లేడుతో ఆమె మెడ కోసి, చేతులపై తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు.
షేకూన్ భర్త రవి దాడిని అడ్డుకోబోయినా…. సురేష్అ తడ్ని నెట్టి వేసి ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన భార్యను రవి వెంటనే స్ధానిక ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ప్రాణాపాయస్ధితి లేకపోవటంతో ఆమెకు మరింత మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. షేకూన్ భర్త ఫిర్యాదు మేరకు సురేష్ పై కేసు నమోదు చేసుకున్నపోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.