Baby Rescued: మైనస్ డిగ్రీల చలిలో చావు బ్రతుకుల మధ్య పసికందు లభ్యం

అతిశీతల ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందు చావుబ్రతుకుల మధ్య లభించింది. ఈఘటన రష్యాలోని మంచు ప్రాంతమైన సోస్నోవ్కా గ్రామంలో చోటుచేసుకుంది.

Baby Rescued: అసలే మంచు ప్రాంతం అందులోనూ మైనస్ డిగ్రీల చలి..పెద్దవారు సైతం ఉన్ని దుస్తులు లేకుండా బయటకు రాలేని పరిస్థితి. అటువంటి అతిశీతల ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందు చావుబ్రతుకుల మధ్య లభించింది. ఈఘటన రష్యాలోని మంచు ప్రాంతమైన సోస్నోవ్కా గ్రామంలో చోటుచేసుకుంది. సోస్నోవ్కా గ్రామంలో ఐదుగురు యువతీయువకులు సాయంత్రంవేళా సరదాగా గడిపేందుకు సమీపంలోని ఆటస్థలానికి వెళ్లారు. చుట్టూ దట్టమైన చెట్లు, మంచుతో కప్పబడి ఉన్న ఆప్రాంతంలో వారికీ ఒక పెట్టె కనిపించింది. బాక్స్ ను తెరిచి చూసిన వారికీ అందులో అప్పుడే పుట్టిన పసికందు లభించింది. ఈ విషయాన్ని వారు తమ తల్లిదండ్రులకు చేరవేయగా.. వారు ఆ పసికందును హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Also read: Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మృతి

పసికందును పరీక్షించిన వైద్యులు..ఆ చిన్నారి బ్రతికే ఉందని గ్రహించి వెంటనే చిన్నారి శరీరాన్ని చేతులతో రుద్దారు. అనంతరం చిన్నారి కళ్ళు తెరిచి చూడగా ఆసుపత్రిలోని వైద్యులు, చిన్నారిని తీసుకొచ్చిన లిట్వినోవ్, అన్నా దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు. మసక చీకటిలో, ఒక పెట్టెలో చిన్నారి ఉందని, చిన్నారికి దుప్పటి చుట్టి, పాల డబ్బాను నోట్లో పెట్టి ఎవరో వదిలి వెళ్లిపోయారని లిట్వినోవ్, అన్నా పోలీసులకు తెలిపారు. ఈఘటన జనవరి 7న చోటుచేసుకోగా.. ప్రస్తుతం ఆ చిన్నారి ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Also read: Parrots Smuggling: రూ.1000 కోసం 140 రామచిలుకల అక్రమ రవాణా చేస్తున్న యువకుడు

కాగా అప్పుడే పుట్టిన పసికందును ఇలా వదిలి వెళ్లడం రష్యా చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరం. దీంతో చిన్నారి అసలు తల్లిదండ్రులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిన్నారిని ఆసుపత్రికి తీసుకొచ్చిన లిట్వినోవ్, అన్నా దంపతులకు ఇప్పటి వరకు అందరు మగపిల్లలు ఉండగా.. ఇప్పుడు లభించిన ఆడబిడ్డను తాము దత్తత తీసుకుంటామంటూ రష్యా అధికారులకు విన్నవించుకున్నారు. చిన్నారి పాప కోసం ఎవరు రాని పక్షంలో అధికారిక పత్రాలు సమర్పించి చిన్నారిని దత్తత తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Also read: Republic Day: మరోసారి కేరళ శకటాన్ని తిరస్కరించిన రక్షణశాఖ

ట్రెండింగ్ వార్తలు