బ్యాంకు క్యాషియర్ రాసలీలలు : 40 మంది కస్టమర్లను లోబరుచుకుని అశ్లీల చిత్రాలు

  • Publish Date - February 20, 2020 / 01:17 PM IST

ఎదైనా గవర్నమెంట్ ఆఫీసులో పని అవ్వాలంటే అక్కడ మనకు తెలిసినోడు ఎవరైనా ఉంటే బాగుండు…త్వరగా పనవుతుంది అనుకుంటాం… అలాగే బ్యాంకుల్లోనూ అంతే…. ఎక్కువ సేపు క్యూలో నిలబడకుండా పనవటం… అవసరం ఐతే బ్యాంకు లోను కావాల్సివచ్చినప్పుడు త్వరగా పని అవటం కానీ…షరతులతో  ఇబ్బంది పెట్టకుండా త్వరగా లోను వస్తుందనో అనుకుంటాం… ఈ  అవసరాన్నే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఈ తమిళ తంబీ. బ్యాంకు క్యాషియర్ గా పనిచేసే  ఎడ్విన్ విజయ్ కుమార్  40 మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని వారితో అశ్లీల వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్  చేయటం మొదలెట్టాడు.  

వంద గొడ్లు తిన్నరాబందు ఒక్క గాలివానకు చచ్చిందన్నట్లు 40 మంది మహిళలను వంచించిన మోసగాడు భార్య చేతిలో బుక్కయ్యాడు. బ్యాంకులో లోను కోసం వచ్చే లేడీ కస్టమర్లను రుణాల పేరుతో బుట్టలో వేసుకున్నాడు. నాతో కాస్త సహకరిస్తే మీకు లోను ఈజీగా వస్తుంది అంటూ మభ్యపెట్టాడు. 
 

మాయమాటలతో దాదాపు 40 మంది వరకూ మహిళలను రుణాల పేరుతో బుట్టలో వేసుకున్నాడు. వారిలో అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న మహిళలు కూడా ఉన్నారు.  వారితో శృంగారం చేస్తూ.. ఆ వీడియోలు రికార్డు చేశాడు. ఇలా మొత్తం 200 అశ్లీల వీడియోలు అతని మొబైల్లో ఉన్నాయి. అయితే ఈ గుట్టు అనూహ్యంగా  కొత్తగా పెళ్లైన అతని భార్య వల్ల బయట పడింది. 
 

తమిళనాడులోని తిరుచురాపల్లి జిల్లా మనప్పారైకి  చెందిన ఎడ్విన్  జయ కుమార్ (36)  పుదుక్కోటై జిల్లా  వీరామలై లోని ఇండియన్ బ్యాంకులో క్యాషియర్ గా పని చేస్తున్నాడు. గతేడాది  తంజావూరు కు  చెందిన ఒక మహిళతో(32) అతనికి వివాహం అయ్యింది.  పెళ్లైన రోజు నుంచి జయకుమార్ భార్యతో ఎక్కువ సేపు గడిపేవాడు కాదు. 
 

ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేరే గదిలోకి వెళ్ళి సెల్ ఫోన్ తో కాలక్షేపం చేసేవాడు. పెళ్లైన కొత్తలో అతని భార్య ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లై కొత్త పెళ్లాం ఇంట్లో ఉన్నా 2 నెలలుగా తనను పట్టించుకోకుండా ఉన్న భర్త  ప్రవర్తన పట్ల అనుమానం వచ్చింది. దీనికి తోడు ఇటీవల భార్య దగ్గర ఉన్నబంగారం కోసం డిమాండ్ చేయటంతో ఆమె అతనిపై అనుమానం మరింత బలపడింది. 
 

ఒక రోజు భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో అతని గదిలోకి వెళ్ళి వెతకగా ఆమెకు 15  స్మార్ట్ ఫోన్ లు కనపడ్డాయి. వాటిలో దాదాపు 200 నీలి చిత్రాలు కనపడ్డాయి. అందులో ఉన్న మహిళల్లో కొందరు తమ చుట్టుపక్కల వారిగా గుర్తించింది. వారితో తన భర్త జయకుమార్ అసభ్యకరంగా, నగ్నంగా ఉన్న వీడియోలు కనిపించాయి. ఈ విషయాన్ని తన అత్తమామలకు చెప్పింది. వారు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.  ఇంక నేరుగా భర్తతోనే తేల్చుకోవాలని  జయకుమార్ని  నిలదీసింది.  
 

అప్పటినుంచి ఆమెపై కక్ష పెంచుకున్నజయకుమార్ రెండు సార్లు ఆమెపై హత్యాయత్నం చేశాడు. అంతేకాక భార్యను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. నువ్వు స్నానం చేస్తున్నప్పడు వీడియోలు తీశానని….తన విషయం బయట పెడితే అవి లీక్ చేస్తానని బెదిరించాడు.బ్యాంకు లో తన సహోద్యోగిని దేవీ బిలోమినాతో కూడా భార్యను బెదిరించాడు. 
 

జయ కుమార్  మహిళలను లోబరుచుకోటానికి దేవీబిలోమినా సహాయ పడినట్లు తెలిసింది. ఆమె తనతల్లితండ్రులతో కలిసి పోలీసు స్టేషన్ లో భర్తపై  ఫిర్యాదు చేసింది. భర్త జయకుమార్ తో పాటు అత్త, అతని సోదరి, బ్యాంకు ఉద్యోగినిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  అప్రమత్తమైన జయకుమార్  13 సెల్ ఫోన్లలో  వీడియోలను డిలీట్ చేసేసి పరారయ్యాడు. ముందస్తుగా హై కోర్టులో బెయిల్ పొందినట్లు తెలిసింది. ప్రస్తుతం పరారీలో ఉన్నజయకుమార్ కుటుంబ సభ్యులు, బ్యాంకు ఉద్యోగిని కోసం పోలీసులు గాలిస్తున్నారు.