Bengaluru Financier kills wife : అందమైన భార్య…అనుమానంతో భర్త…!

భార్యా రూపవతీ శత్రువు...అనినానుడి ఉంది. అందమైన భార్యను పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోక భార్యమీద అనుమానంతో ఆమెను కడతేర్చాడు బెంగుళూరుకు చెందిన ఒక భర్త.

Husband Killed Wife

Bengaluru Financier kills wife : భార్యా రూపవతీ శత్రువు…అని నానుడి ఉంది. అందమైన భార్యను పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోక భార్యమీద అనుమానంతో ఆమెను కడతేర్చాడు బెంగుళూరుకు చెందిన ఒక భర్త.

అన్నపూర్ణేశ్వరి నగర్‌లో నివసించే బీఆర్.కాంతరాజు (40) ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాడు. అతని భార్య రూప (32) పేరుకు తగ్గట్టుగానే అందంగా ఉంటుంది. ఎక్కవ సమయం ఇంట్లోనే ఉండే కాంతరాజుకు భార్య ప్రవర్తన మీద అనుమానం కలిగింది. తన భార్య అందంగా ఉంది. ఆమె తనతో కాక వేరేవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందేమో అనే సందేహం ఎప్పుడూ అతడిని వేధిస్తూ ఉండేది.

ఈ మానసిక సమస్యతో అతను  నిత్యం సతమతమవుతూ ఉండేవాడు. ఆమె ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడినా అనుమాన పడేవాడు. ఈ మానసిక వేదన తట్టుకోలేక భార్యను చంపాలని  నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రెండు కన్నడ సినిమాలు చూశాడు.  ఆ సినిమాల్లో  చూపించినట్లు భార్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.

ప్లాన్ 1 ప్రకారం భార్యను టూర్ కు తీసుకువెళ్లి ఎత్తైన కొండమీదనుంచి కిందకు తోసి చంపటం.. దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరింతచటం
ప్లాన్ 2 ప్రకారం రెండు కార్లు ఢీ కొని ఒక కారులో ఉన్న భార్య చనిపోయేలా ప్లాన్ చేయటం … కాలక్రమంలో ఇవి రెండు అమలు చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు.

Also Read : MAA Elections 2021 : ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బండ్ల గణేష్..

ఎలాగైనా రూపను చంపాలనే పంతం రాన్రాను పెరిగిపోతూ వస్తోంది. ఇటీవల రూప వాళ్ల పుట్టింటి  వారితో కలిసి  ఒక 14 మంది చిక్‌మంగ్‌ళూరు 3 రోజుల టూర్‌కు వెళ్లారు. వారితో కాంతరాజు కూడా వెళ్ళాడు. అక్కడ రూప  అందరితో కలివిడిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ తిరిగింది. ఒకరోజు రాత్రి రిసార్ట్ లో ఏర్పాటు చేసిన  చలిమంట  చుట్టూ అందరూ కలిసి డ్యాన్స్ లు చేశారు.

అందులో ఇద్దరు మగవారితో రూప కూడా డ్యాన్స్ చేసింది. అది చూసి తట్టుకోలేని కాంతరాజు రూప పై మరింత అనుమానం పెంచుకున్నాడు. సెప్టెంబర్ 21న బెంగుళూరు తిరిగి వచ్చిన తర్వాత ఆ డ్యాన్స్ విషయమై భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఆవ్యక్తులు తన కుటుంబ సభ్యులని వారి గురించి చెడుగా ఆలోచించవద్దని రూప భర్తకు చెప్పింది.

అయినా ఆమె మాట వినని కాంతరాజు మళ్లీ మర్నాడు భార్య  ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ గొడవకు దిగాడు. తాను అటువంటి దానిని కానని అనవసరంగా తప్పుగా ఆలోచిస్తున్నారని రూప భర్తకు నచ్చచెప్పింది.  కోపం పట్టలేని కాంతరాజు సమీపంలోని స్క్రూడ్రైవర్  తీసుకుని ఆమె గొంతులో దింపి హత్య చేశాడు. ఇంట్లో కూరగాయలు కోసుకునే కత్తి తీసుకువచ్చి ఆమె మెడ కోసి పరారయ్యాడు.

ఇంట్లోబెడ్ రూంలో హత్యకు గురైన రూపను చూసిన ఆమె మామ రామకృష్ణ ఈ విషయాన్ని రూప చెల్లెలు లత కు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంతరాజు కోసం గాలింపు చేపట్టారు. కాంతరాజు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకోవాలని ప్రయత్నం చేశారు… కానీ దొరకలేదు. ఎవరితోనైనాఫోన్ చేసిన వెంటనే ఫోన్ స్విఛ్ఛాప్ చేసి అక్కడి నుంచి పరారయ్యేవాడు.

మళ్లీ అక్కడి నుంచి ఫోన్ చేసి వేరే చోటకు పారిపోయేవాడు. చివరికి చేతిలో చిల్లి గవ్వలేక ఇబ్బుందులు పడుతూ మహాలక్ష్మీ లేఅవుట్ లోని   ఒక స్నేహితునికి ఫోన్ చేసి అతడిని  డబ్బులు అడిగాడు. అతను సరే అన్నాడు. ఈ సమాచారం పసిగట్టిన పోలీసులు మహాలక్ష్మీ లే అవుట్ వద్ద కాపు కాసి స్నేహితుడి దగ్గర డబ్బు తీసుకోటానికి వచ్చిన కాంతరాజును అదుపులోకి తీసుకున్నారు.