Bengaluru Robbery: మీరు ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటున్నారా? అయితే బీకేర్ ఫుల్. వారు ఎలాంటి వారు, వారి నేపథ్యం ఏమిటి, గతంలో ఎక్కడ పని చేశారు, క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఏమైనా ఉందా, కేసులు ఏమైనా ఉన్నాయా? ఇలా అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఎలాంటి ఎంక్వైరీ చేసుకోకుండా ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మేసి పని మనుషులుగా పెట్టుకున్నారంటే.. మీ ఇల్లు గుల్ల కావడం ఖాయం. బెంగళూరులో భారీ చోరీ జరిగింది. తిన్న ఇంటికే కన్నం వేశారు పని మనుషులు. ఏకంగా యజమాని ఇంటి నుంచి 18 కోట్లు దోచుకెళ్లారు. 11.5 కేజీల బంగారం, 5 కేజీల వెండి, వజ్రాభరణాలు, 11 లక్షల నగదు.. మొత్తం 18 కోట్లు దోచుకున్నారు.
28 ఏళ్ల వ్యాపారవేత్త ఇంట్లో ఈ భారీ చోరీ జరిగింది. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో లాకర్లను పగులగొట్టి పెద్ద మొత్తంలో బంగారం, వెండిని దోచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వ్యాపారి కుటుంబం పలువురిని పని మనుషులుగా పెట్టుకుంది. వీరిలో అంబిక వంట మనిషి, సిద్ధరామ్ ఉద్యోగి, ఇద్దరు హౌస్ కీపింగ్ కార్మికులు (దినేష్, కమల). 20 రోజుల క్రితమే హౌస్ కీపింగ్ ఏజెన్సీ ద్వారా వ్యాపారి ఇంట్లో పనికి చేరారు నేపాల్ కు చెందిన దినేష్, కమల దంపతులు. వంట పని కోసం కమల, సెక్యూరిటీ గార్డుగా దినేష్ వచ్చారు. కాగా, కొన్ని రోజుల్లోనే వీరు యజమాని దగ్గర మంచి నమ్మకాన్ని సంపాదించారు. తర్వాత అదను కోసం వేచి చూసిన కిలేడీ దంపతులు.. ఒక రోజు తమ ప్లాన్ ను అమలు చేశారు.
జనవరి 25న ఉదయం 9 గంటల ప్రాంతంలో వ్యాపారి కుటుంబం తన బంధువుల ఇంట్లో జరిగే వేడుకలో పాల్గొనేందుకు వెళ్లింది. ఇదే అదనుగా దినేష్ తన ప్లాన్ ను అమలు చేశాడు. భారీ చోరీకి పాల్పడ్డాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో, వంట మనిషి అంబిక యజమానికి ఫోన్ చేసింది. ఇంట్లో చోరీ జరిగినట్లు చెప్పింది.
వ్యాపారి ఇంట్లో పలు లాకర్లు ఉన్నాయి. అవన్నీ తెరిచి ఉన్నాయి. లాకర్ల నుండి దాదాపు 10 కిలోల బంగారం, వజ్రాల ఆభరణాలు దొంగిలించబడ్డాయి. మొదటి అంతస్తులోని లాకర్‌ను కూడా పగలగొట్టారు. అక్కడి నుండి సుమారు 1.5 కిలోల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.11.5 లక్షల నగదు దొంగిలించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా దాదాపు 11.5 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 5 కిలోల వెండి ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించారు.
తమ కుటుంబ సభ్యుల కదలికలను నిశితంగా గమనించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దినేష్ దంపతులు ఇతర పని మనుషులతో కలిసి ఈ దొంగతనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యాపారి. ఇంటి ఓనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దినేష్ (32), అతని భార్య కమల (25), ఇతరులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
A sensational theft has come to light in #Bengaluru’s #Marathahalli area, where gold, diamonds, silver, and cash worth ₹18 crore were stolen from the residence of builder Shivakumar in #Yamaluru. The accused are a couple who had joined the house as domestic workers just 20 days… https://t.co/oj95imofAW pic.twitter.com/P7g6vOAZjP
— Hate Detector 🔍 (@HateDetectors) January 28, 2026
Also Read: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. లాస్ట్ మినిట్‌లో ఏం జరిగింది?