డ్రగ్స్ కేసు: ఈ హీరోయిన్ల ఫోన్లలో నీలి వీడియోలు, సెక్స్ రాకెట్ కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు!

Sandalwood drug case: సుశాంత్ సూసైడ్ తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ తారల గుట్టు రట్టవుతుంటే.. మరోవైపు శాండల్ వుడ్ పరిస్థితి అలానే ఉంది. ఒక దాని గురించి ఎంక్వైరీ చేస్తుంటే మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న యాక్టర్లుRagini Dwivedi, Sanjana Galrani ఫోన్లలో బ్లూ ఫిల్మ్స్, అటువంటి ఫొటోలు ఉన్నాయట.
ఇద్దరి మొబైల్స్ లోనూ ఇవే బయటపడ్డాయని.. అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో మరో కోణంతో అందరూ షాక్ అయ్యారు. ఏదో డౌన్ లోడ్ చేసిన వీడియోలు, ఫొటోలు మాత్రమే కాదు.. ఏకంగా వారంతా వాట్సప్ గ్రూపునే మెయింటైన్ చేస్తున్నారు.
నటి రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం అధారంగా సీసీబీ పోలీసులు 3 రోజుల నుంచి ఇంకొందరిని ఆఫీసుకు పిలిపించి విచారిస్తున్నారు. రాగిణి సన్నిహితులిద్దరిని చామరాజపేటలోని సీసీబీ ఆఫీసులో విచారించారు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. మాఫియా డాన్‌తో సంబంధాలున్న ఒక యువకున్ని సీసీబీ అదుపులోకి తీసుకొని విచారించింది. ఇటీవల సస్పెండ్ అయిన ఏసీపీతో ఇతనికి సంబంధాలున్నట్లు తెలిసింది.
మరో ఇద్దరు అరెస్ట్:
మంగళూరు పోలీసులు బెంగళూరులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కెంగేరికి చెందిన ఒకరు, నైజీరియాకు చెందిన మరొక వ్యక్తిని అరెస్ట్ చేసి మంగళూరుకు తరలించారు. మంగళూరుకు చెందిన సీసీబీ టీం వీరిని పట్టుకోగలిగింది. ముంబై, గోవా సెంటర్ల నుంచి డ్రగ్స్‌ను తెచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లుగా వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న డ్యాన్సర్ కిశోర్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు.