Bengalore
Husband’s Porn Addiction : నిత్యం ఫోర్న్ సైట్స్ చూడడం, వీడియోలు చూస్తున్న భర్తను అలా చేయవద్దని సూచించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ భర్త..ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు. ఈ విషయం అత్తా..మామలకు చెప్పినా ఫలితం లేకపోయింది. కొడుకు మద్దతు తెలుపుతూ..హింసకు గురి చేశాడు. దీంతో ఆ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. తనకు న్యాయం చేయాలని కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.
Read More : Eetala Rajendar: నాకు కొందరు సీక్రెట్ గా సపోర్ట్ చేశారు.. వాళ్ల పేర్లు చెప్పను..!
బెంగళూరులో జయనగర్ ప్రాంతంలో ఓ మహిళకు 2019లో వివాహం జరిగింది. ఆమె భర్త..గత కొద్ది కాలంగా..ఫోర్న్ సైట్స్ చూడడం ప్రారంభించాడు. పట్టించుకోకపోవడంతో ఆమెకు అనుమానం కలిగింది. అప్పుడు అసలు విషయం తెలిసింది. షాక్ కు గురైన ఆమె…అలా చేయవద్దని భర్తకు సూచించింది. రాత్రి సమయంలో కాల్ గర్స్ కు ఫోన్ చేసి ఎంజాయ్ చేస్తున్నాడు. వారి కోసం డబ్బులు ఖర్చు చేసేవాడు. మరో అడుగు ముందుకేసి ఓ మాట్రిమోని వెబ్ సైట్ లో తన పేరు కూడా నమోదు చేసుకున్నాడు.
Read More : Facebook: ఫేస్ బుక్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ ఫెసిలిటీ లేదు..!
భార్య విడాకులు ఇచ్చిందని…వివరాల్లో వెల్లడించాడు. ఆగడాలు భరించలేని ఆమె…ఆ వీడియోలు చూడొద్దని సూచించింది. దీంతో ఆమెను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. ఇదే విషయాన్ని అత్తామామలకు చెప్పింది. కానీ..కొడుకుకే వారు సపోర్టు చేశారు. పాడైన భోజనం పెట్టి వేధించారు. నాలుగు గోడలకు పరిమితం చేసి హింసించారు. చివరకు బాధిత మహిళ ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనకు జరిగిన అన్యాయంపై మొర పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని కోరడంతో..భర్తపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులను మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది.