Bharatpoor Gang : ఆన్ లైన్ మోసాల్లో సైబర్ మోసగాళ్ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. ఓఎల్ ఎక్స్ వంటి వెబ్ సైట్లను ఆసరగా చేసుకుని ఆన్ లైన్ మోసాలకు తెగబడుతున్నారు. ఎంతో మంది బాధితులు భరత్ పూర్ గ్యాంగ్ చేతుల్లో మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఈ గ్యాంగ్ ఆటకట్టించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎట్టకేలకు ఆన్‌లైన్‌లో చీటింగ్‌లకు పాల్పడుతున్న భరత్ పూర్ గ్యాంగ్ ఆట కట్టించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.
ఆన్ లైన్ మోసాలకు పాల్పడిన 9 మందిని అరెస్ట్ చేశారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా ఓఎల్ ఎక్స్ లో మోసాలను ఒక్కొక్కటిగా బయటపెట్టేశారు. ఓఎల్ ఎక్స్ లో పెద్ద మొత్తంలో ఈ గ్యాంగ్ అక్రమాలకు పాల్పడుతోంది.
విచారణలో భాగంగా గ్యాంగ్ కు సంబంధించి 9 మంది ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సంచుల కొద్ది సిమ్ కార్డులు బయటపడ్డాయి. బస్తాల్లో దొరికిన సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.