భూవివాదం- 13ఏళ్ల కొడుకు ముందు వితంతువుపై సామూహిక అత్యాచారం

బీహార్ లోని జముయి జిల్లాలో దారుణంజరిగింది, భూవివాదాల నేపధ్యంలో 30 ఏళ్ల వితంతువుపై ఆమె బంధువులు,13 ఏళ్ల కుమారుడి ముందు కొట్టి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.

widow allegedly gang raped in front of her minor son at jamuai district, two attresed : బీహార్ లోని జముయి జిల్లాలో దారుణంజరిగింది, భూవివాదాల నేపధ్యంలో 30 ఏళ్ల వితంతువుపై ఆమె బంధువులు,13 ఏళ్ల కుమారుడి ముందు కొట్టి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.

జముయి జిల్లాలోని చకై పోలీసు స్టేషన్ పరిధిలో 30 ఏళ్ల వితంతువు తన 13 ఏళ్ల చిన్న కుమారుడ్ని పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమె పెద్ద కుమారుడు(16) సూరత్ లో పనిచేసుకుంటున్నాడు,.సోమావరం మార్చి 1 వ తేదీ అర్ధరాత్రి ఆమెకజిన్ సోదరి భర్త సుఖ్ దేవ్ యాదవ్, మరియు అతని బావ మహేంద్రయాదవ్ ఆమె ఇంటికి వచ్చారు. ఇద్దరూ ఆమెను కొట్టారు. అనంతరం ఆమె 13 ఏళ్ల కొడుకు ముందు ఆమెపై అత్యాచారం చేశారు.

అత్యాచారం అనంతరం బాధితురాలు చకై పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు వితంతువును వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల రిపోర్టు వచ్చిన తర్వాత దర్యాప్తు చేపడతామని స్ధానిక ఎస్సై తెలిపారు. భూ వివాదాల కారణంగా రేప్ జరిగిందా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. బాధితురాలు పేర్కోన్న నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.