raja Singh
BJP MLA Raja Singh : హైదరాబాద్ పాతబస్తీలో సోమవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ మత ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలతో తమ మనో భావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ ఎమ్‌ఐఎమ్ పార్టీకి చెందిన వ్యక్తులు సోమవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో ఆందోళ చేపట్టారు.
పాతబస్తీలోని అన్ని పోలీసు స్టేషన్లలో రాజాసింగ్ పై ఫిర్యాదులు చేశారు. పోలీసు స్టేషన్ల ఎదుట బైఠాయించి అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల పోలీసులకు, ప్రజలకు మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్ధరాత్రి బషీర్ బాగ్ లోని పోలీసు కమీషనర్ కార్యాలయం ఎదుట కూడా నిరసన తెలిపారు.
Also Read : Rakesh JhunJhunwala : భార్య,తమ్ముడికి కంపెనీ, గురువుకు ట్రస్ట్-ముందే విల్లు రాసిన ఝన్‌ఝన్ వాలా