అర్ధరాత్రి దున్నపోతు బలి, క్షుద్రపూజల భయంతో 3 రోజులుగా ఈ ఊళ్లో నిద్రాహారాలు లేవు

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలు గ్రామంలో చేతబడి కలకలం రేపింది. చేతబడి భయంతో గ్రామస్తులు మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గుడుపుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 06:39 AM IST
అర్ధరాత్రి దున్నపోతు బలి, క్షుద్రపూజల భయంతో 3 రోజులుగా ఈ ఊళ్లో నిద్రాహారాలు లేవు

Updated On : February 13, 2020 / 6:39 AM IST

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలు గ్రామంలో చేతబడి కలకలం రేపింది. చేతబడి భయంతో గ్రామస్తులు మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గుడుపుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలు గ్రామంలో చేతబడి కలకలం రేపింది. చేతబడి భయంతో గ్రామస్తులు మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గుడుపుతున్నారు. గ్రామంలో కామాక్షి అనే మహిళ చేతబడి చేస్తుందని తెలిసి భయాందోళనకు గురవుతున్నారు. జామాయిల్ తోటలో ఒక బాలుడి బొమ్మను చిత్రీకరించి గొయ్యి తీసి నిమ్మకాయులు, కుంకుమ, పసుపుతో క్షుద్రపూజలు ఆనవాళ్లు కనిపించాయి.

దీంతో క్షుద్రపూజలు చేసిన మహిళలను గ్రామస్థులు చితకబాదారు. క్షుద్రపూజలకు సంబంధించిన సామాగ్రిని తగలబెట్టారు. వారం రోజుల నుంచి గ్రామంలో చేతబడి జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. చేతబడి చేసిందని భావిస్తున్న మహిళను పట్టుకుని 3 రోజులుగా విచారిస్తున్నారు. చేతబడి ఎక్కడెక్కడ, ఏమేమీ పెట్టిందని ఎంక్వైరీ చేశారు.

గ్రామంలో ఉన్నటువంటి జామాయిల్ తోటలో దున్నపోతును బలి ఇచ్చి..దాన్ని తలను గొయ్యిలో పాతి పెట్టింది. అక్కడే బాలుడి బొమ్మను చిత్రీకరించి..నిమ్మకాయలు, కుంకుమ, పసుపుతో పూజలు చేసి, గోతిలో పాతి పెట్టింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను తీసుకెళ్లి గోతిలో పెట్టిన క్షుద్రపూజలు సామాగ్రిని బయటికి తీయించారు. చేతబడి చేసిన మహిళలను చితకబాదారు. గ్రామంలోని ఏ బాలుడు, ఎవరి మీద క్షుద్రపూజలు ప్రయోగించిందని తెలియలేదు. దీనికి తోడు దుమ్మపోతును బలి ఇవ్వడం, బాలుడికి సంబంధించి ఏ ఇంటి పిల్లల మీద ప్రయోగిస్తుందోనని భయాందోళనకు గ్రామస్తులు గురయ్యారు.

చిన్న చిన్న గామ్రాలు కావడం, చేతబడి నిర్వహిస్తున్న మహిళ భయకంపితులను చేయడంతో గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. మూడు రోజుల క్రితం ఈ విషయం బయట పడింది. దున్నపోతు తల నరికి గొయ్యి తీసి పెట్టడంత, క్షుద్రపూజు చేసిన సామాగ్రిని గోతిలో పాతిపెట్టిన విషయాన్ని 2 గంటలకు గ్రామస్తులు కనుగొన్నారు. చేతబడి కలకలం భయకంపితులను చేస్తోంది.