Vijayawada Crime: బెజవాడలో రెచ్చిపొతున్న గంజాయి గ్యాంగ్, మహిళల ఆందోళన

కొందరు యువకులు స్థానిక వైఎస్ఆర్ కాలనీలో తిష్టవేసి గంజాయి, మద్యం సేవిస్తూ స్థానికులపై దాడులకు తెగబడుతున్నారు

Crime1

Vijayawada Crime: విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లు వీరంగం సృష్టిస్తున్నాయి. చీకటిపడితే చాలు.. కొందరు యువకులు స్థానిక వైఎస్ఆర్ కాలనీలో తిష్టవేసి గంజాయి, మద్యం సేవిస్తూ స్థానికులపై దాడులకు తెగబడుతున్నారు. గురువారం విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీలో ఓ యువకుడు స్థానికంగా వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై దాడికి పాల్పడుతూ బీభత్సం సృష్టించాడు. దీంతో స్థానికులు ఆయువకుడిని పట్టుకుని కొత్తపేట పోలీసులకు అప్పగించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి గ్యాంగ్ ల వలన ఇళ్ళలో ఉండాలంటే భయమేస్తుందని స్థానిక మహిళలు 10టీవీతో మొరపెట్టుకున్నారు. చీకటి పడితే కొందరు యువకులు ఇంటి ముందుకు వచ్చి గంజాయి సేవిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని.. ఎదురు ప్రశ్నిస్తే.. ఇంటిలోకి వచ్చి గొడవలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు.

Also Read: Weed sale made him Millionaire: జాబ్ వదిలేసి “మరిజువానా” సాగుతో కోట్లు సంపాదిస్తున్న యువకుడు

అర్ధరాత్రి వారుచేసే అగడాలతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొందని..పోలీసులకు చెబితే తూతూ మంత్రంగా వచ్చి తనిఖీలు చేసి వెళ్లిపోతున్నారని స్థానిక మహిళలు వాపోయారు. బ్లడ్ బ్యాచ్, గంజాయి సేవిస్తున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాలనీ వాసులు కోరుతున్నారు. ఇక ఈ ఘటనపై టూ టౌన్ సీఐ మోహన్ రెడ్డి 10టీవీతో మాట్లాడుతూ, బ్లేడ్ గంజాయి బ్యాచ్ లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Also Read: Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగులో తెగుళ్ళు…యాజమాన్యం