Bomb Blast In Ravikamatham
Bomb Blast : విశాఖజిల్లా, రావికమతం మండలం మేడివాడ గ్రామంలో సోమవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది.ఈ పేలుడులో నూకరత్నం అనే వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీపావళి సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించినట్లు బాధితులు చెపుతున్నారు.
Also Read : Volunteer Misbehaviour : వివాహితతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన-కేసు నమోదు
కానీ… ఆస్తి తగాదాల కారణంగా తల్లిని హతమార్చేందుకే బాంబు పేలుడు జరిపినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.ప్రమాదంలో గాయపడిన మహిళను 108లో నర్సిపట్నం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.