OMG : సిమెంట్ బెంచ్ పడి పార్క్‌లో బాలుడి మృతి

  • Publish Date - April 26, 2019 / 02:39 AM IST

ఆడుకుంటూ చిన్నారులు చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆడుకుంటూ రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభం పట్టుకుని చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా పార్కులో సిమెంట్ బెంచ్‌పై కూర్చొని ఆడుకుంటున్న చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద ఘటన రాజేంద్రనగర్ హైదర్ గూడ‌లో చోటు చేసుకుంది. 

జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ప్లే గ్రౌండ్ ఉంది. ఏప్రిల్ 25వ తేదీ గురువారం నిశాంత్ శర్మ బాలుడు సిమెంట్ బెంచ్‌పై కూర్చొన్నాడు. దానిని అటూ..ఇటూ..కదుపుతున్నాడు. ఒక్కసారిగా సిమెంట్ బెంచ్ బోల్తా పడింది. దాని కింద నిశాంత్ చిక్కుకపోయాడు. వెంటనే అక్కుడున్న వారు సిమెంట్ బెంచ్‌ని పైకి లేపారు. తలకు తీవ్ర గాయం కావడంతో నిశాంత్ చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

విషయం తెలుసుకున్న నిశాంత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. విరిగిపోయిన సిమెంట్ బెంచ్ ఉంచడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. పార్క్ నిర్వాహణ సరిగ్గా లేదని అపార్ట్‌మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.