Bride Flees : కాసేపట్లో రిసెప్షన్.. వరుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వధువు.. రూ.10లక్షల విలువైన నగలతో జంప్..

దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Bride Flees : పెళ్లి జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. ఇంతలోనే పెళ్లి కొడుక్కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు. రిసెప్షన్ కి కొన్ని గంటల ముందు తన ప్రియుడితో కలిసి జంప్ అయ్యింది. పోతూ పోతూ 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు తీసుకెళ్లిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని టీటీ నగర్ లో ఈ ఘటన జరిగింది.

టీటీ నగర్ కి చెందిన ఆశిశ్ రజక్ గంజ్ బసోడాకు చెందిన రోషిని సోలంకికి మంగళవారం వివాహం ఘనంగా జరిగింది. బుధవారం రిసెప్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, రిసెప్షన్ కి కొన్ని గంటల ముందు.. వధువు బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. ఇదే అదనుగా ఎస్కేప్ ప్లాన్ చేసింది. వరుడు, అతడి కుటుంబసభ్యులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

Also Read : 25 అడుగుల ఎత్తు నుంచి తుంగభద్ర నదిలోకి దూకిన హైదరాబాద్ లేడీ డాక్టర్.. ఆ తర్వాత ఎంత ఘోరం జరిగిందంటే.. బీకేర్ ఫుల్..

రెడీ అయ్యేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లిన వధువు.. తన ప్రియుడితో కలిసి అటు నుంచి అటే పారిపోయింది. పోతూ పోతూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 10 లక్షల విలువైన నగలతో ఉడాయించింది. దీంతో వరుడు, అతడి కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు.

అసలేం జరిగిందో తెలుసుకునే లోపు వధువు తన ప్రియుడితో పారిపోయింది. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా, ఎలాగైనా తన భార్యను వెనక్కి తీసుకురావాలని పోలీసులను వేడుకున్నాడా భర్త.

కాగా.. వధువు కిడ్నాప్ అయ్యిందని ముందు అంతా అనుకున్నారు. పోలీసులతోనూ ఇదే విషయం చెప్పారు. కానీ, పోలీసులు వధువు కాల్ డేటాను చెక్ చేయగా.. షాకింగ్ నిజం బయటపడింది. తన ప్రియుడితో ఆమె జంప్ అయినట్లు తెలిసింది.

Also Read : ఎంత ఘోరం.. మెడపై పడిన 270 కిలోల బరువైన రాడ్.. అక్కడికక్కడే వెయిల్ లిఫ్టర్ మృతి.. వీడియో వైరల్

పోలీసుల విచారణలో అనికేత్ మాల్వియా పేరు తెరపైకి వచ్చింది. అతడే ఆమె బాయ్ ఫ్రెండ్ అని పోలీసులు నిర్ధారించారు. పారిపోవడానికి ముందు.. అనికేత్ తో రోషిని చాలాసార్లు ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. పరారీలో ఉన్న వధువు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.