atp bridge collapse
Anantapur : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంతెన కూలీ ముగ్గురు వ్యవసాయ కూలీలు గల్లంతయ్యారు. జిల్లాలోని డి.హీరేహాల్ మండలం నాగలాపురం, బొమ్మనహాల్ మండలం ఉద్దేహాళ్ గ్రామల మద్య హెచ్.ఎల్.సి. కాలవ పై ఉన్న వంతెన కూలి పోయింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళా కూలీలు గల్లంతయ్యారు.
ఉద్దేహాళ్‌కు చెందిన కూలీలు మల్లికేతి వద్ద టమోటా పొలంలో పనిచేసి తిరిగి స్వగ్రామానికి బొలెరో వాహనంలో వెళ్తుండగా కాలవపై రాగానే వంతెన మధ్యకు విరిగి కుప్ప కూలింది. దీంతో కూలీలు ప్రాణభయంతో అర్తనాదాలు పెట్టగా స్థానికులు కొందరిని బయటకు తీశారు.
Also Read : Covid Cases In Telangana Police : తెలంగాణ పోలీసు శాఖను కలవర పెడుతున్న కోవిడ్ కేసులు
ముగ్గురు మహిళా కూలీలు నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని గల్లంతైన మహిళల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో కూలిన వంతెన