Pak drone : అమృత్‌సర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ స్వాధీనం

భారత సరిహద్దుల్లో పాక్ డ్రోన్ ను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మరో పాక్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు....

Pak drone

Pak drone : భారత సరిహద్దుల్లో పాక్ డ్రోన్ ను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మరో పాక్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత అమృత్‌సర్‌లోని కక్కర్ గ్రామ శివార్లలో డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. (BSF, Punjab Police recover another Pak drone)

Fishing Boat Accident : కేరళలో ఫిషింగ్ బోట్ ప్రమాదం, ఒకరి మృతి, ముగ్గురు గల్లంతు

భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్‌పై అజ్నాలా సబ్ డివిజన్‌లోని కక్కర్ గ్రామ సమీపంలో (International Border in Amritsar) సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) ఆదివారం కాల్పులు జరిపింది. నిర్ధిష్ట సమాచారంతో గాలించగా పాక్ డ్రోన్ కనిపించిందని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి చెప్పారు.

Heavy Rain Alert : ఇళ్లలోనే ఉండండి..ప్రజలకు హిమాచల్ సీఎం హెచ్చరిక

సెర్చ్ ఆపరేషన్ సమయంలో గ్రామం ప్రక్కనే ఉన్న వ్యవసాయ క్షేత్రం నుంచి భద్రతా దళాలు డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దుల్లో తరచూ పాక్ డ్రోన్లు సంచరిస్తుండటం ఇటీవల పెరిగింది. పాక్ నుంచి డ్రగ్స్, ఆయుధాలను డ్రోన్ల ద్వారా భారతదేశంలోకి పంపిస్తున్నారని తేలింది.