Bangaluru: ఇది రీల్ కాదు బాస్ రియల్.. బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తే ముక్కున వేలేసుకుంటారు

బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఈ ఘటన వెలుగు చూసింది. కొంత మంది చెడు డ్రైవర్ల సమూహం 2 సెకన్ల గ్యాపును ఉంచకపోవడంతో కార్లు ఒకదాని తర్వాత మరొకటి ఢీ కొట్టుకున్నాయి

Bangaluru: ఇది రీల్ కాదు బాస్ రియల్.. బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తే ముక్కున వేలేసుకుంటారు

రోడ్డుపై వాహనాలు ఒకదానికి ఒకటికి వరుసగా ఢీకొట్టడం సినిమాల్లో, రీల్స్ లో చూస్తుంటాం. రియల్ లైఫులో చాలా పెద్ద పెద్ద ప్రమాదాలే జరుగుతాయి కానీ, ఇలా కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొట్టే ఘటనలు అరుదు. కాగా, తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఈ ఘటన కనిపించినట్లు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వీడియోను షేర్ చేశాడు. రెండు సెకన్ల ట్రాఫిక్ రూల్స్ తెలిసుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని అతడు తన పోస్టులో పేర్కొన్నాడు.


నరేష్ అనే వ్యక్తి (ఎక్స్(ట్విట్టర్)లో అతడిని ఐడీ టాప్ డ్రైవర్ ఇండియా అని ఉంది) తన ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. అనంతరం ‘‘బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఈ ఘటన వెలుగు చూసింది. కొంత మంది చెడు డ్రైవర్ల సమూహం 2 సెకన్ల గ్యాపును ఉంచకపోవడంతో కార్లు ఒకదాని తర్వాత మరొకటి ఢీ కొట్టుకున్నాయి. ఎందుకు రూల్స్ గురించి పదే పదే చెప్తావని చాలా మంది నన్ను అడుగుతుంటారు. అయితే ఈ రెండు సెకన్ల గ్యాపును కనుక పాటించినట్లైతే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని నేను వారికి చెప్తున్నాను’’ అని పోస్ట్ చేశారు.