దొంగ తెలివి : దోపిడీ తర్వాత సీసీటీవీ ఫుటేజీ ఎత్తుకెళ్లారు
చెన్నై: తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో దొంగలు పడ్డారు. బ్యాంకులోని లాకర్లు ఓపెన్ చేసి 10 కోట్ల

చెన్నై: తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో దొంగలు పడ్డారు. బ్యాంకులోని లాకర్లు ఓపెన్ చేసి 10 కోట్ల
చెన్నై: తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో దొంగలు పడ్డారు. బ్యాంకులోని లాకర్లు ఓపెన్ చేసి 10 కోట్ల రూపాయల క్యాష్, 5 కేజీల గోల్డ్ దోచుకెళ్లారు. జాతీయ రహదారి పక్కనే ఉండే సమయపురంలో ఇంతటి భారీ దోపిడీ జరగడం జిల్లాలో కలకలం రేపింది. 2019, జనవరి 26, 27 తేదీలు బ్యాంకుకు సెలవులు. దీన్ని దొంగలు క్యాష్ చేసుకున్నారు. 2019, జనవరి 28వ తేదీ సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకు తెరిచారు. అనంతరం లోపలికి వెళ్లి చూడగా చోరీ విషయం బయటపడింది. గోడకు కన్నం వేసిన దొంగలు లోనికి ప్రవేశించారు. అయితే దొంగలు చాలా తెలివిగా వ్యవహరించారు. తమ ఆనవాళ్లు బయటపడకుండా ఏకంగా సీసీటీవీ ఫుటేజీని కూడా తమతో పాటు ఎత్తుకెళ్లిపోయారు. దొంగల తెలివితేటలకు పోలీసులు కంగుతిన్నారు.
బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు వెనక భాగంలో వెల్డింగ్ మిషన్‌తోపాటు పలు పరికరాలను పోలీసులు గుర్తించారు. అక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి ముగ్గురు వ్యక్తులు ఈ దోపిడీలో పాల్గొన్నట్టు వారు అనుమానిస్తున్నారు.