ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. మృతుల్లో ఎస్ఐ, నవ వరుడు

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ, నవ వరుడితో సహా ముగ్గురు దుర్మరణం పాలయిన విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

car accident in mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ముగ్గురు ప్రాణాలను బలిగొంది. భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఎస్ఐ, నవ వరుడు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.

గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. హైదరాబాద్ నుంచి అనంతపూర్ వెళ్తున్న కారు.. లారీని ఓవర్ టేక్ చేస్తూ ప్రమాదానికి గురయినట్టు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: పాము కాటుకు ఒంటె కన్నీరు విరుగుడు అట.. ఎలాగో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు