వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురు చిన్నారులుసహా ఐదుగురు మృతి

వనపర్తి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.

Road Accident

Car Hit Tree Wanaparthy : వనపర్తి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున కొత్తకోట వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో కారులో 11 మంది ఉన్నారు. వీరిలోముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఆగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటీన స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, ఆరుగురిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Road Accident : సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి

కారుబళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రిలోని మార్చరీకి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ప్రమాదానికి కారణం అతివేగంతోపాటు డ్రైవర్ నిద్రమత్తు కారణం అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అయితే, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.