దిశ ఎన్ కౌంటర్‌పై కేసు నమోదు..బుల్లెట్ల కోసం సెర్చింగ్

  • Publish Date - December 7, 2019 / 03:45 AM IST

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇందుకోసం 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం మరోసారి ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్లారు. ఎన్‌కౌంటర్ సందర్భంగా నిందితులపై తూటాల వర్షం కురిపించిన ఖాకీలు ఇప్పుడు ఆ తూటాలను సేకరిస్తున్నారు. బుల్లెట్ల కోసం మెటల్ డిటెక్టర్లతో రంగంలో దిగింది  క్లూస్‌ టీమ్‌. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ఈ తనిఖీల్లో ఇప్పటికే రెండు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్ల కోసం ఇంకా సెర్చింగ్ కొనసాగుతోంది.

మరోవైపు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ హత్య కేసు విచారణ అధికారిగా సురేందర్ ఉన్నారు.

* దిశ హత్యాచార నిందితులను పోలీసులు 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ చేశారు. 
* షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. 
* నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. 
* 2019, నవంబర్ 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేశారు. 
* అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు. 
* ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులుగా గుర్తించారు.
* దిశ కేసులో నిందితులను గురువారం 2019, డిసెంబర్ 5వ తేదీన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Read More :