Fake Certificates : నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరిన కస్టమ్స్ అధికారిపై కేసు నమోదు

నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న హైదారాబాద్ జీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

Fake Certificates  : నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న హైదారాబాద్ జీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సంజయ్ శాంతారాం పాటిల్ అనే వ్యక్తి 1990లలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ముంబై కస్టమ్స్ శాఖలో ఉద్యోగంలో చేరాడు. 2015లో సంజయ్ పాటిల్ నకిలీ సర్టిఫికెట్ల బాగోతంపై సంజయ్ జాదవ్ అనే వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

కస్టమ్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన విజిలెన్స్ అధికారులు కేసు విచారిస్తున్న సమయంలోనే 2017 లో సంజయ్ పాటిల్ పదోన్నతిపై హైదారాబాద్ జీఎస్టీలో అసిస్టెంట్ కమీషనర్ హోదాలో చేరాడు. విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు 2019 లో సంజయ్ పాటిల్ సర్టిఫికెట్లు అన్నీనకిలీవని గుర్తించారు. రాంచీ విశ్వవిద్యాలయం నుంచి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాడని గుర్తించారు.

ఉద్యోగంలో చేరే సమయంలో సంజయ్ పాటిల్ రాంచీ విశ్వవిధ్యాలయం డిగ్రీ సర్టిఫికెట్ తో పాటు… ప్రోవిజనల్, మైగ్రేషన్ సర్టిఫికెట్, మార్కుల షీట్, రాంచీలోని మార్వాన్ కళాశాల ప్రిన్సిపాల్ ధృవీకరించిన హాల్ టికెట్ తో సహా అన్నీ తప్పుడు సర్టిఫికెట్లు అని గుర్తించారు. దీంతో 2019 లో ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు.
Also Read : Raging : తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో ర్యాగింగ్‌.. జూనియర్‌ను చితకబాదిన సీనియర్లు

తదుపరి చర్యలకోసం హైదరాబాద్ జీఎస్టీ అండ్ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయం 2021 నవంబర్‌లో సీబీఐకి ఫిర్యాదు చేసింది. సీబీఐ దర్యాప్తులోనూ  సంజయ్ పాటిల్ నకిలీ బాగోతం బయట పడటంతో అతడిపై కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు