Raging : తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో ర్యాగింగ్‌.. జూనియర్‌ను చితకబాదిన సీనియర్లు

తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. సీనియర్లు తొమ్మిది మంది కలిసి.. ఒక విద్యార్థిని చావబాదారు.

Raging : తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో ర్యాగింగ్‌.. జూనియర్‌ను చితకబాదిన సీనియర్లు

Raging

Raging in NIT : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో ర్యాగింగ్‌ కలకలం రేగింది. విద్యార్థుల మధ్య వివాదం.. వేధింపులకు దారితీసింది. సీనియర్లు.. జూనియర్‌ను ఇష్టం వచ్చినట్టు కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. సీనియర్లు తొమ్మిది మంది కలిసి.. ఒక విద్యార్థిని చావబాదారు. ఫోన్‌ చేసి పిలిచి.. హాస్టల్‌ గదిలో దాడి చేశారు. చేతికి దొరికిన వస్తువులతో చావబాదారు. వీరి వివాదం ముందే డైరెక్టర్‌ దాకా వెళ్లినా.. పట్టించుకోకపోవడంతో దాడి వరకు వెళ్లింది.

బీటెక్‌ మెకానికల్‌ సెకండియర్‌ చదువుతున్న జయకిరణ్‌కి.. సీనియర్లకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. జయకిరణ్‌ని సీనియర్లు చాలాసార్లు బెదిరించారు. ఈ క్రమంలోనే జయకుమార్‌ను ఫ్రెండ్‌ రూమ్‌కి పిలిపించిన సీనియర్లు.. రాత్రి పది గంటల నుంచి ఉదయం పది గంటల వరకు మోకాళ్లపై కూర్చోబెట్టారు. హాస్టల్‌ గదిలో చేతికి అందిన జగ్గు, వాటర్‌ బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు, బెల్టులతో చావబాదారు.

Ragging Turmoil: సూర్యాపేటలో మెడికల్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం

తీవ్రగాయాలపాలైన జయకిరణ్‌.. వారు విడిచిపెట్టిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీనియర్లు తనను ఇష్టం వచ్చినట్టు కొట్టినట్టు బాధితుడు చెబుతున్నాడు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా క్యాంపస్‌లో అవగాహన కార్యక్రమాలు చేపడతామంటున్నారు.

సీనియర్లతో జయ కిరణ్‌కి విభేదాలు, వివాదాలు నడుస్తున్న సంగతి కాలేజీ యాజమాన్యానికి ముందే తెలిసింది. వీరి ఘర్షణ అంశం డైరెక్టర్‌ వరకు వెళ్లింది. అయినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో సీనియర్లు రెచ్చిపోయారు. తమను ఎవరు ఏమీ చేయరనే ధైర్యంతో జయకుమార్‌ను చితకబాదారు.

Raging : వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

ఇలాంటి ఘటనలు నిట్‌లో నిత్యకృత్యం అయ్యాయి. ర్యాగింగ్‌ అక్కడ కామన్‌గా మారిపోయింది. అయితే లోపల జరుగుతున్న అరాచకాలు బయటకు రానీయకుండా నిట్‌ యాజమాన్యం జాగ్రత్తపడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. క్యాంపస్‌లోని అకృత్యాలను దాచిపెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.