Raging : వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం చెలరేగింది. ప్రేషర్స్‌ డే పేరుతో సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని ఓ విద్యార్థి ఫిర్యాదు చేశాడు.

Raging : వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

Kakatiya

Warangal Kakatiya Medical College : వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం చెలరేగింది. ప్రేషర్స్‌ డే పేరుతో సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని ఓ విద్యార్థి ఫిర్యాదు చేశాడు. సీనియర్లు మద్యం తాగి వేధిస్తున్నారని తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.

2017 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ర్యాగింగ్‌ చేస్తున్నారని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వరంగల్‌ సీపీ, డీహెచ్‌లను ట్యాగ్‌ చేశాడు. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరాడు.

PM Modi : భోపాల్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

ర్యాగింగ్‌ ఆరోపణలపై కాకతీయ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ మోహన్‌దాస్‌ స్పందించారు. ర్యాగింగ్‌ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. సీనియర్లు అంటే గిట్టనివారే ర్యాగింగ్‌ ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు.

ఇక వరంగల్‌ సీపీ కూడా ర్యాగింగ్‌ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాలతో మట్టెవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీహెచ్‌ రమేశ్‌రెడ్డి కూడా బాధిత విద్యార్థి ఆరోపణలపై ఆరా తీశారు.